‘నిఖిల్ కార్తికేయ-2’.. ప్రత్యేకమైన పాత్రలో స్వాతి

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కి భారీ విజయాన్నందుకున్న చిత్రం 'కార్తికేయ'. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. అయితే ఇందులో కలర్స్ స్వాతి ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందని..

నిఖిల్ కార్తికేయ-2.. ప్రత్యేకమైన పాత్రలో స్వాతి

Edited By:

Updated on: Apr 21, 2020 | 6:10 PM

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కి.. భారీ విజయాన్నందుకున్న చిత్రం ‘కార్తికేయ’. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. అయితే ఇందులో కలర్స్ స్వాతి ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. డెబ్యూ మూవీగా చందూకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత హీరో నిఖిల్‌కి కూడా మంచి ఇమేజ్ దక్కింది.

‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో త్రిష చెల్లిగా.. అమాయకమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది స్వాతి. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అందులో ఒకటి కార్తికేయ. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తికేయ 2 రాబోతోంది. ఇందులో స్వాతి ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం.

ఇప్పటికే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుంది. రాక్షసుడు తర్వాత తెలుగులో ఆమె నటిస్తోన్న సినిమా ఇదే. కథ పరంగా మొదటి భాగంలో ఉండే హీరో పాత్ర మాత్రమే ఉంటుందని, మిగిలిన పాత్రలన్నీ మారిపోతాయని మరో టాక్‌ వినిస్తోంది. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో దీనిని లిమిటెడ్ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తీయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. కాగా ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read More: 

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

చరిత్రలో మొదటిసారిగా మైనస్‌లోకి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

ఫేస్‌బుక్‌ నుంచి మరో సరికొత్త యాప్.. ఫ్రీ గేమింగ్!