Shilpa Shetty: భయంకరంగా మారిన శిల్పాశెట్టి.. సాగర కన్య ఇలా భయపెట్టడమేంటని ప్రశ్నిస్తున్న నెటిజన్లు…

|

Jul 02, 2021 | 8:32 PM

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో శిల్పాశెట్టి ఒకరు. ఒకప్పుడు తన అందంతోపాటు.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శిల్పాశెట్టి.. ప్రస్తుతం బుల్లితెరపై తన సత్తా చూపిస్తోంది.

Shilpa Shetty: భయంకరంగా మారిన శిల్పాశెట్టి.. సాగర కన్య ఇలా భయపెట్టడమేంటని ప్రశ్నిస్తున్న నెటిజన్లు...
Shilpa Shetyy
Follow us on

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో శిల్పాశెట్టి ఒకరు. ఒకప్పుడు తన అందంతోపాటు.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శిల్పాశెట్టి.. ప్రస్తుతం బుల్లితెరపై తన సత్తా చూపిస్తోంది. పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ బ్యూటీ..ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతోపాటు.. లెటేస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా శిల్పాశెట్టికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శిల్పాను చూసి.. ఆమె అభిమానులు వణికిపోతున్నారు.

ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో పాల్గోంటున్న శిల్పాశెట్టి.. ఒక డాన్స్ రియాల్టీ షో కోసం దెయ్యంగా మారిపోయింది. అచ్చం దెయ్యంలాగే కాస్ట్యూమ్స్ ధరించి తన మేకప్ తో అందరిని భయపెట్టేసింది. పొడవైన చేతులు.. భయంకరమైన ఫేస్, వింతైన కాస్యూమ్స్ తో నిజంగానే దెయ్యం వచ్చిందేమో అన్నట్లుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శిల్పాను ఇలాంటి గెటప్ లో చూడలేమంటూ ఆమె అభిమానులు నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. ఒక రియాల్టీ షో కోసం ఇంతగా డ్రస్ అప్ అవ్వడం.. జనాలను భయ పెట్టడం ఏంటీ అంటూ కొందరు శిల్ప శెట్టిని ప్రశ్నిస్తున్నారు. సూపర్ డాన్స్ ఛాప్టర్ 4 లో భాగంగా శిల్ప శెట్టి ఇలా సెట్ లో సందడి చేసింది. డాన్స్ మరియు యోగా అంటే చాలా ఇష్టపడే శిల్ప తన అందంకు రహస్యం ఆ రెండే అంటూ చెబుతూ ఉంటుంది.

తెలుగులో శిల్పాశెట్టి.. విక్టరీ వెంకటేష్ సరసన సాహస వీరుడు సాగర కన్య సినిమాలో నటించింది. ఆ సినిమాతో సాగర కన్య అంటే.. శిల్పా శెట్టి అనేలా ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యింది. తెలుగు లో ఈమె చేసింది కొన్ని సినిమా లే అయినా కూడా సౌత్ హీరోయిన్స్ రేంజ్ లో గుర్తింపు దక్కించుకుంది.

Also Read: Yash: బెంగుళూరులో ఖరీదైన ఇల్లు కొన్న యష్.. భార్యతో కలిసి నూతన గృహప్రవేశం చేసిన రాకీబాయ్.. ధర ఎంతంటే..

Shruti Das: ‘నువ్వు బ్లాక్ బోర్డ్.. కమిట్‏మెంట్ ఇచ్చినందుకే నీకు ఛాన్స్’… దారుణంగా ట్రోల్స్.. ఫిర్యాదు చేసిన నటి..