హీరోహీరోయిన్స్ అంటే విపరీతమైన అభిమానాన్ని పెంచుకుంటుంటారు. తమకు ఇష్టమైన సెలబ్రెటీ పుట్టినరోజు..సినిమా విడుదల తేదీలు వస్తే అభిమానులు చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తమ అభిమాన సెలబ్రెటీ ఎదురుగా వస్తే… ఊరుకుంటారా ఇక.. అయితే సెలబ్రెటీలు అంటే పెద్దవారికి.. యూత్‌కు మాత్రమే కాకుండా.. చిన్నపిల్లలకు కూడా విపరీతమైన ఇష్టం ఉంటుంది. అదే వారు ఎదురుగా వస్తే.. తమ అభిమానాన్ని విభిన్న రకాలుగా చూపిస్తారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాపై తనకున్న అభిమానాన్ని చూపించాడు ఓ బాలుడు..
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మలైకా ప్రస్తుతం ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ 2 షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. అందులో షూటింగ్లో భాగంగా సీటులో కూర్చొని ఉండగా.. చిన్న పిల్లలు మలైకా వద్దకు వచ్చారు. దీంతో వారి చేతులు పట్టుకుని మలైకా ముచ్చటిస్తుండగా.. ఓ బాలుడు ఆమె చెంపలు పట్టుకుని లాగాడు.. మొదట షాక్ అయిన మలైకా.. వెంటనే తెరుకుని.. తిరిగి ఆ పిల్లాడి బుగ్గలను పట్టుకుని లాగింది. అనంతరం వారిని కౌగిలించుకుంది. తాజాగా ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది మలైకా.. ఈ వీడియ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మలైకా వీడియోకు సినీ ప్రముఖులతోపాటు.. ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ ఒకరు అభిమానంతో మలైకా చెంపలను పట్టకోవడానికి ప్రయత్నించగా. ఆమె భయపడింది. అనంతరం దాని గురించి మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో కావడంతో అతని చేతులను శానిటైజ్ చేశారా ? లేదా ? అని ఆ సమయంలో ఆలోచిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది మలైకా.
ఇన్‌స్టా పోస్ట్..
Also Read: Varun Tej: మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. ‘గని’కి మాట సాయం చేస్తోన్న మెగా పవర్ స్టార్..