సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై సుధీర్ తన కామెడీతో ప్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. అంతేకాదు.. యూత్‌లో సుడిగాలి సుధీర్‌కు భారీగానే ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై ప్రేక్షకులకు తిరుగులేని ఎంటైర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న ప్రోగ్రామ్ జబర్ధస్త్ ద్వారా ఫేమస్ అయ్యాడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపైనే కాకుండా… వెండితెరపై తనదైన నటనతో అలరిస్తున్నాడు సుధీర్. జబర్ధస్త్ కామెడీ షోలోనే కాకుండా.. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు సుధీర్. తాజాగా ఈ బుల్లితెర హీరోకు అదిరిపోయే కౌంటర్స్, పంచులతో ఆడుకుంది హీరోయిన్ మహేశ్వరి.
తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమెను సాదరంగా ఆహ్వానించిన సుధీర్ ఆమెతో చేయి కలపడానికి ప్రయత్నించారు. దీంతో రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పింది మహేశ్వరి. అదెంటీ నేను హాలో అంటే మీరు నమస్కారం అన్నారని సుధీర్ అడగ్గా.. నీతో చేయి కలిపితే నువ్వు పులిహర కలుపుతావు అంటూ కౌంటరిచ్చింది మహేశ్వరి. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ఆ తర్వాత నన్ను ఎక్కడ ఉండమంటారు అని అడగ్గా.. నాకు మాత్రం దూరంగా ఉండు అంటూ మరో పంచ్ వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్