బిగ్ బాస్ సీజన్ 5 ముందు నుంచి ఈ సీజన్ పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా తెలియని ముఖాలను తీసుకురావడం.. ఈసారి బిగ్ బాస్ షోలో పెద్దగా జోష్ కనిపించలేదని.. చప్పగా సాగుతుందని ముందు నుంచి విమర్శిస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ఇక బిగ్ బాస్ చివరి దశకు చేరుకున్న కంటెస్టెంట్స్ ఆట తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇంట్లో ఉన్న సభ్యుల దృష్టి బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల పై కాకుండా.. బయట జనాలు చూస్తున్నారా… ఓట్లు అనుకూలంగానే ఉంటాయా అంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇక బ్రహ్మ షణ్ముఖ్ తీరు మాత్రం ఇప్పటికీ అర్థం కావట్లేదంటున్నారు నెటిజన్స్.
షో మొదటి నుంచి నాకు నేనే.. నచ్చితే చేస్తా లేదంటే లేదు అన్నట్టుగా టాస్కులలో పర్ఫామెన్స్ చేయకుండా.. స్నేహితులతో కలిసి కబుర్లు చెబుతూ నెట్టుకోచ్చాడు. ఇక చివరి దశకు చేరుకుని.. టైటిల్‌కు చేరువవుతున్న సమయంలోనూ షణ్ముఖ్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. పైగా గత రెండు రోజులుగా ఇంట్లో ఫన్నీ మూమెంట్స్ జరుగుతున్నా.. వాటిని సీరియస్ చేస్తూ అరుస్తూ గొడవలకు పోతున్నాడు షణ్ముఖ్.. దీంతో అతనిపై నెగిటివి పెరిగిపోతుంది. ఇక ఇప్పటికే షణ్ముఖ్, సిరిల రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకు తగినట్టుగానే వారిద్దరి ప్రవర్తన కూడా ఉంటుంది. ఇక గత రెండు రోజుల నుంచి సిరి ఎవరితో మాట్లాడిన షణ్ముఖ్ సహించలేకపోతున్నాడు. నీ క్యారెక్టర్ బ్యాడ్ చేసుకుంటున్నావంటూ.. ఇద్దరితో ట్రాక్ నడుపుతున్నవాని బయటకు దరిద్రంగా వెళ్తుందంటూ పదే పదే సిరి వ్యక్తిత్వం గురించి నీచంగా కామెంట్స్ చేస్తున్నాడు షణ్ముఖ్. ఇక సిరి ఇష్టానుసారంగా మాటలు అనేసి.. ఆ తర్వాత హగ్గులు తీసుకోవడం కామన్.
ఇక వీరిద్దరి హగ్గులు నచ్చడం లేదంటూ సిరి తల్లి మాట్లాడిన మాటలను ఇప్పటికే గుర్తుచేస్తూ సిరిని దారుణంగా అవమానిస్తున్నాడు షణ్ముఖ్.. ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్గు అంటూ సిరి తల్లి మాటలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్లో షణ్ముఖ్.. పూర్తిగా సిరిపై అధికారం చెలాయించే ప్రయత్నం చేశాడు. ఆమెతోపాటు.. ఆమె తల్లి మాటాలను కూడా తప్పు అంటూ వాదించాడు. దీంతో సిరి ఏం మాట్లాడలేకపోయింది. అయితే వీటన్నింటిపై స్పందిస్తూ నటి మాధవీలత తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసింది. షో మొదటి నుంచి బిగ్ బాస్ చూస్తూ.. తన అభిప్రాయాలను తెలియజేస్తుంది మాధవీలత.
” ఏమయ్యా బిగ్ బాస్.. సిగ్గులేని టీం.. ఏందయ్యా ఇది.. ఆ బిగ్ బాస్ హౌస్ లో అరాచకం. ఒక ఆడపిల్లను బానిసను చేసి నవ్వకూడదు.. ఏడ్వకూడదు.. వంగకూడదు.. అనే మానసిక ఆత్యాచారం చేస్తుంటే.. ఎవడో పెళ్లాన్ని ఇంకోకడు డామినేట్ చేస్తుంటే.. వీకెంట్ ఊపుకుంటూ వచ్చిన మా నాగ్ మావ ఏమో అబ్బా ఎంట్రా ఇది అంటూ వగలు పోయి.. అమ్మా వద్దు అన్న హగ్గులు ఇప్పిస్తూ.. మీ ఫుటేజ్ కోసం ఆఖరికి నాగార్జున ని కూడా దిగజార్చిన మీకు టీఆర్పీ లేక ఏడుస్తున్నారు. ఒక కన్నతల్లి మాటని విలువ లేకుండా చేసిన. కూతురిని సపోర్ట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మా నాగ్ మావా.. ఎందండీ ఈ అరాచకం ఏందీ అంటా.. అలాంటి యాదవలకు బిగ్ బాస్ లో ప్లేస్ ఒకటి. వాడికే కప్ తగలబెట్టి మీ బిగ్ బాస్ సెట్ కూడా తగలబెట్టండి.. ఇలాంటి వాడికి కీరిటం పెడితే మీ బీబీ కొంపకి పైర్ యాక్సిడెంట్ అయి తర్వాత నిమిషాం తగలబడి పోతుంది చూడండి.. అసలు సమాజానికి ఏం చూపిస్తున్నారు ? యూత్ లో హగ్స్ అండ్ కిస్ లు తప్పేం కదా.. పక్కోడి పెళ్లాన్ని హగ్ చేసుకోవచ్చు అంటున్నారు. నాతో వాదిస్తున్నారు తప్పేంటని. స్నేహం ముసుగులో కామ కాలపాలు చూడలేకున్నాము.. మీ బీబీ టీం చివరి ఎపిసోడ్ చూసి..మీ నిర్ణయం సమాజనికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే బిగ్ బాస్ షో పై డైరెక్ట్ గా సూప్రీం కోర్టులో కేసు వేస్తారు. హైకోర్టులో కూడా వేస్తాను. ఇది జోక్ కాదు.. సీరియస్.. టైంపాస్ కోసం టీవీ చూద్దామంటే అవమానాలే కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలిసి చూడాలంటే సిగ్గుగా ఉంది. చెవిపై.. మెడపై.. హార్డ్ పై ముద్దులు పెట్టుకుంటే చూడటానికి అసహ్యంగా ఉంది .. అడల్ట్ షో చూస్తున్నామా అనే ఫీలింగ్.. ఓటీటీలో పర్సనల్ గా చూసే షోలా ఉంది.. తగలబెట్టండి సర్ బీబీ 5 వరస్ట్ టీం.. వరస్ట్ షో” అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది.
ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో