Anasuya: యూట్యూబ్ ఛానల్స్ పై అనసూయ ఆగ్రహం.. అది దిగజారుడుతనమంటూ..

|

Dec 25, 2021 | 8:41 AM

ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ యాంకర్లలో అనసూయ ఒకరు. గత కొన్నేళ్లుగా జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను

Anasuya: యూట్యూబ్ ఛానల్స్ పై అనసూయ ఆగ్రహం.. అది దిగజారుడుతనమంటూ..
Anasuya
Follow us on

ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ యాంకర్లలో అనసూయ ఒకరు. గత కొన్నేళ్లుగా జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ.. ఇటు వెండితెరపై పలు కీలక పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మాత్త పాత్రలో అదరగొట్టింది అనసూయ. ఈ సినిమాతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇటీవల అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమాలో అనసూయ నటించి మెప్పించింది. దాక్షయాణి పాత్రలో మరోసారి తన సత్తా చాటింది అనసూయ. ఇదిలా ఉంటే.. పుష్ప నుంచి విడుదలైన అనసూయ పోస్టర్స్ పై బాడీ షేమింగ్ చేశాయి పలు యూట్యూబ్ ఛానల్స్.

అనసూయ పోస్టర్స్, లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ.. ఆమె చూడు బాగా లావు అయ్యింది.. ఎలా మారిపోయింది అంటూ బాడీ షేమింగ్ చేస్తూ యూట్యూబ్ థంబ్‏నైల్స్ తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఆ యూట్యూబ్ ఛానల్స్‏కు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది అనసూయ.

తాజాగా తన ఇన్ స్టా లైవ్ లోకి వచ్చిన అనసూయ మాట్లాడుతూ.. నేను లైవ్ వచ్చానంటే అందరికీ చాలా కంగారుగా ఉంటుంది. ఇప్పుడేం క్లాసులు పీకుతుందో అని. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ థంబ్ నెయిల్స్ చూశాను. వాటిని పట్టించుకోకూడదని అనుకుంటా కానీ.. అన్ని సందర్భాల్లోనూ ఇంతే స్ట్రాంగ్ గా ఉండలేం కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయి. అటెన్షన్ కోసం కామెంట్స్ చేస్తుంటారు. ఎంత లావు అయిపోయిందో చూడండి.. ఓవర్ వెయిట్.. షాకింగ్.. లాంటి థంబ్ నెయిల్స్ పెట్టారు. మంచి వాటినే చదివి వాళ్లతోనే షేర్ చేసుకోవాలని అనకుంటున్నాను.. నేను వెయిట్ పెరిగాను.. ఈ సందర్భంలో మీ క్యారెక్టర్.. మీ దిగజారుడుతనాన్ని ఎలా ఎత్తుకుంటారని నేను ఆ కామెంట్స్ చేసేవాళ్లను అడుగుతున్నా.. నేను కూడా మీలాగే మాట్లాడగలను.. హర్ట్ చేయగలను కానీ అది నా వ్యక్తిత్వం కాదు.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనసూయ.

Also Read: RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్‌.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు

Bangarraju Movie: షూటింగ్ పూర్తి చేసిన బంగార్రాజు.. త్వరలోనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్న టీమ్..