CM KCR- Chiranjeevi: చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఫోన్ చేశారు. ఇటీవల  మెగాస్టార్ కు కరోనా (Corona) సోకడంతో  ఫోన్ చేసి పరామర్శించారు.

CM KCR- Chiranjeevi: చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

Updated on: Jan 27, 2022 | 1:46 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఫోన్ చేశారు. ఇటీవల  మెగాస్టార్ కు కరోనా (Corona) సోకడంతో  ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య విషయాలను అడిగితెలుసుకున్నారు.  కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. కాగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని చిరంజీవి నిన్న (జనవరి 26) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలిందన్నారు.  ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని, తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.  త్వరలోనే  తాను పూర్తి ఆరోగ్యంతో ముందుకు వస్తానని పేర్కొన్నారు.

కాగా థర్డ్ వేవ్ లో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న చిరంజీవితో పాటు మరో ప్రముఖ నటుడు శ్రీకాంత్ కరోనా బారిన పడ్దారు. అంతకుముందు మహేశ్ బాబు, థమన్, మంచులక్ష్మి, విశ్వక్ సేన్, యానీమాస్టర్ తదితరులు కరోనాకు గురయ్యారు.

Also read:Gudivada Casino Issue: గుడివాడ కేసినో వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి.. గవర్నర్ కు లేఖ రాసిన టీడీపీ అధినేత..

Dil Raju- Harish Shankar: దొంగతనం పక్కా అంటోన్న దిల్ రాజు, హరీశ్ శంకర్.. క్రైం వెబ్ సిరీస్ కు శ్రీకారం..

Coronavirus: దేశంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. పెరిగిన యాక్టివ్ కేసులు.. నిన్న ఎంత మంది వైరస్ బారిన పడ్డారంటే..