‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ను కొనాలనుకుంటోన్న టీడీపీ

| Edited By:

Mar 18, 2019 | 3:48 PM

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై ఇంకా సంగ్ధిగ్ధత కొనసాగుతోంది. ఈ మూవీకి సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు ఒప్పుకున్నప్పటికీ.. ఈ మూవీని ఆపేయాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పు రావడానికి చాలా సమయమే పట్టేలాగా ఉంది. దీంతో మార్చి 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీని కొనేందుకు టీడీపీకి చెందిన కొందరు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ విడుదలను ఆపివేయాలనుకుంటోన్న కొంతమంది లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను కొనుగోలు […]

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ను కొనాలనుకుంటోన్న టీడీపీ
Follow us on

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై ఇంకా సంగ్ధిగ్ధత కొనసాగుతోంది. ఈ మూవీకి సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు ఒప్పుకున్నప్పటికీ.. ఈ మూవీని ఆపేయాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పు రావడానికి చాలా సమయమే పట్టేలాగా ఉంది. దీంతో మార్చి 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీని కొనేందుకు టీడీపీకి చెందిన కొందరు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ విడుదలను ఆపివేయాలనుకుంటోన్న కొంతమంది లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను కొనుగోలు చేసి రిలీజ్‌ను ఆపేయాలనుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అనుకున్న సమయానికి లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వర్మ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత కథాంశాలతో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తప్పుగా చూపించారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు ఎన్నికల కమిషన్‌ను ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.