Taraka Ratna: తారకరత్న మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య అలేఖ్య.. ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌.

|

Feb 25, 2023 | 7:59 AM

చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన నందమూరి తారకరత్న పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. తారకరత్న మృతిపై ఆయన కుటంబంతో పాటు సినీ, రాజకీయ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...

Taraka Ratna: తారకరత్న మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య అలేఖ్య.. ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌.
Tarakaratna Wife Alekhya Reddy
Follow us on

చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన నందమూరి తారకరత్న పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. తారకరత్న మృతిపై ఆయన కుటంబంతో పాటు సినీ, రాజకీయ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త అర్ధాంతంరంగా కన్ను మూయడంతో ఆమె ఆవేదన వర్ణణాతీతం. తారకరత్న అకాల మరణం అలేఖ్యను తీవ్రంగా కుంగదీసింది. తారకరత్న అంత్యక్రియల సమయంలో అలేఖ్యను ఓదార్చడం ఎవరివల్లా కాలేకపోయింది.

ఇదిలా ఉంటే భర్త చనిపోయిన తర్వాత తొలిసారి స్పందించారు అలేఖ్య రెడ్డి. ఫిబ్రవరి 22న తారకరత్న పుట్టిన రోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ చేశారు. భర్త చేతిలో చేయి వేసిన ఓ ఫొటోను పోస్ట్‌ చేసిన అలేఖ్య.. ‘మనం జీవితంలో మనం ఎన్నో పోరాటాలు చేశాం. నీ చివరి రోజుల వరకు కలిసి ఫైట్‌ చేశాం. కార్లలో నిద్రించిన రోజుల నుంచి ఇప్పటివరకు.. మన జీవిత ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేశాం. నువ్వు ఒక వారియర్‌ నానా.. నువ్వు చూపించినంత ప్రేమ మాపై ఇంకెవ్వరూ చూపించలేరు’ అంటూ ఎమోషనల్ పోస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు తీవ్ర భావోద్వానికి గురవుతున్నారు. అలేఖ్య రెడ్డికి ధైర్యం చెప్పేలా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తారకరత్న, అలేఖ్య రెడ్డిలది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. తారకరత్న ఇంట్లో ఈ పెళ్లికి నిరాకరించడంతో సీక్రెట్‌గా గుడిలో వీరిద్దరూ వివాహం చేసుకున్న విషయం విధితమే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..