Vikram: ‘బాయ్‌కాట్‌ ట్రెండ్‌’పై మీ అభిప్రాయం ఏంటి.? దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన హీరో విక్రమ్‌..

|

Aug 29, 2022 | 10:30 AM

Vikram: వైవిధ్య భరితమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు తమిళ స్టార్ హీరో విక్రమ్‌. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను...

Vikram: బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై మీ అభిప్రాయం ఏంటి.? దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన హీరో విక్రమ్‌..
Vikram
Follow us on

Vikram: వైవిధ్య భరితమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు తమిళ స్టార్ హీరో విక్రమ్‌. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాడు. తెలుగు హీరోలకు పోటీగా విక్రమ్‌ సినిమాలు విడుదలవుతాయంటేనే విక్రమ్‌కు మన దగ్గర ఉన్న క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా సినిమాకు కొత్త వేరియేషన్‌ చూపించే విక్రమ్‌ తాజాగా కోబ్రో అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ చిత్రంపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చాయి. ఈ సినిమాలో ఏకంగా 10 గెటప్స్‌లో కనిపించిననున్న విక్రమ్‌ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. జ్ఞాన ముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన విక్రమ్‌కు ఓ రిపోర్టర్‌ నుంచి బాయ్‌కాట్‌ ట్రెండ్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

గత కొన్నిరోజులుగా బాలీవుడ్‌లో కొన్ని సినిమాలప బాయ్‌కాట్ ట్రెండ్ వైరల్‌ అవుతోన్న విషయం తెలిసిందే. దీనిపై మీ అభిప్రాయం ఏంటని విక్రమ్‌ని అడగ్గా.. దీనికి తనదైన శైలిలో ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు విక్రమ్‌. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘బాయ్‌ అంటే తెలుసు.. గర్ల్‌ అంటే బాగా తెలుసు. చివరకు కాట్ అంటే కూడా తెలుసు.. అసలు ఈ బాయ్‌కాట్ అంటే ఏంటి.? ఈ పదనే నాకు తెలియదు’ అని చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడ ఉన్న విలేకర్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. అంతటి కాంట్రవర్సీ ప్రశ్నకు కూడా విక్రమ్‌ ఫన్‌తో కూడిన ఆన్సర్‌ ఇవ్వడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..