తమిళ ‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ లుక్ విడుదల!

|

Jun 15, 2019 | 10:16 AM

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమాను తమిళంలో బాల డైరెక్షన్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘వర్మ’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాకపోయేసరికి.. సినిమాను మధ్యలో ఆపేశారు. అయితే ఆ తర్వాత పలు మార్పులు చేసి.. డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా అసిస్టెంట్ గిరిసయ్యను తీసుకుని.. చిత్ర షూటింగ్‌ను […]

తమిళ అర్జున్ రెడ్డి ఫస్ట్ లుక్ విడుదల!
Follow us on

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమాను తమిళంలో బాల డైరెక్షన్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘వర్మ’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాకపోయేసరికి.. సినిమాను మధ్యలో ఆపేశారు. అయితే ఆ తర్వాత పలు మార్పులు చేసి.. డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా అసిస్టెంట్ గిరిసయ్యను తీసుకుని.. చిత్ర షూటింగ్‌ను రీసెంట్‌గా పూర్తి చేశారు.

‘ఆదిత్య వర్మ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ సంగీత దర్శకుడు రధన్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా బానితా సందు నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో ధృవ్ రెండు షేడ్స్‌లో కనిపిస్తాడు. కాగా ఈ సినిమా టీజర్‌ను ఈనెల 16న విడుదల విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్‌గా న‌టిస్తుంది.