డబ్బుకోసం అతన్ని పెళ్లి చేసుకుందని కామెంట్స్.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన నటి

|

May 21, 2024 | 11:11 AM

కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాతో ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆతర్వాత నెల్సన్ తెరకెక్కించిన వరుణ్ డాక్టర్ సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు కింగ్‌స్లీ.  ఆతర్వాతగా నెల్సన్ తెరకెక్కించిన అన్ని సినిమాల్లో కనిపించి కట్టుకున్నాడు కింగ్‌స్లీ.

డబ్బుకోసం అతన్ని పెళ్లి చేసుకుందని కామెంట్స్.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన నటి
Redin Kingsley
Follow us on

రెడిన్‌ కింగ్‌స్లీ.. ఈ పేరు పెద్దగా ప్రేక్షకులకు పరిచయం లేదు కానీ ఆయన్ను చూస్తే వెంటనే ;గుర్తుపట్టేస్తారు. అంతే కాదు చూడగానే నవ్వుకుంటారు.అంతలా తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆయన. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాతో ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆతర్వాత నెల్సన్ తెరకెక్కించిన వరుణ్ డాక్టర్ సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు కింగ్‌స్లీ.  ఆతర్వాతగా నెల్సన్ తెరకెక్కించిన అన్ని సినిమాల్లో కనిపించి కట్టుకున్నాడు కింగ్‌స్లీ. విజయ్ బీస్ట్, సూపర్ స్టార్ జైలర్ సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. కాగా కింగ్‌స్లీ గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో ప్రియురాలు, నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ జంట పై ట్రోల్స్ వస్తున్నాయి. సంగీతను టార్గెట్ చేసి డబ్బుకోసమే వయసులో పెద్దవాడిని పెళ్లి చేసుకుందని అంటున్నారు. కేవలం ఆమె డబ్బు కోసమే  లేటు వయసులో కింగ్‌స్లీ ను పెళ్లి చేసుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ విషయం పై సంగీత స్పందించింది. అయితే సంగీతకు ఇది మొదటి వివాహం కాదు..

ఆమె గతంలో క్రిష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత రెడిన్‌ కింగ్‌స్లీతో ప్రేమలో పడింది ఈ అమ్మడు. ఈ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వయసులో పెళ్లి అవసరమా.? కేవలం డబ్బుకోసం పెళ్లి చేసుకున్నావ్ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీని పై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మెంటల్ గా నా వయసు 19, ఆయనకు 21 మేము ఇలానే ఫీలవుతున్నాం. నేను డబ్బుకోసం పెళ్లి చేసుకున్నా అని అంటున్నారు. నేను ఆయన సింప్లిసిటీ చూసి పెళ్లి చేసుకున్నా.. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది సంగీత. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సంగీత తమిళ్ సీరియల్స్ లో ఎక్కువగా నటించింది. అటు రెడిన్‌ కింగ్‌స్లీ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి…