Tanya Ravichandran: సీనియర్ తమిళ హీరో రవించంద్రన్ మనవరాలు తాన్యా రవి చంద్రన్ 2016లో వెండి తెరకు పరిచయమైంది. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న తాన్యా ఇప్పటి వరకు కేవలం 5 సినిమాల్లోనే నటించింది. ఇక తాజాగా కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాజా విక్రమార్క’ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇస్తోందీ చిన్నది. తనదైన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ చిన్నది తొలి సినిమా ఇంకా విడుదలవక ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రాజా విక్రమార్క సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. దీంతో సినిమా తేదీ విడుదల దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ సినిమా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగానే అందాల తార శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తాన్యా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఈ సందర్భగా తాన్యా మాట్లాడుతూ.. ‘మాది సినిమా కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది. కానీ అమ్మానాన్నలు అప్పట్లోనే వద్దన్నారు. ముందు చదువుపై దృష్టి పెట్టమని కోరారు. అయితే పీజీలో చేరిన తర్వాత దర్శకుడు మిస్కిన్ సర్ నుంచి అవకాశం వచ్చింది. మా పేరెంట్స్ ఒప్పుకోకపోయినప్పటికీ.. గొడవపడి ఒక్క సినిమా చేసి మళ్లీ చదువుకుంటానని ఒప్పించా. కానీ వరుసగా అవకాశాలు వచ్చాయి. మూడు సినిమాలు చేశాక మళ్లీ పీజీ పూర్తి చేశా. ఇప్పుడు పూర్తిగా సినిమాలపై దృష్టిపెట్టా. ఇప్పుడు మా తాతయ్య ఉండుంటే ఎంత సంతోషించేవారో. దురదృష్టవశాత్తూ నేను కెమెరా ముందుకు రాకముందే మాకు దూరమయ్యారు. ఆయన పట్టుదల, క్రమశిక్షణే నాకు స్ఫూర్తి’ అని చెప్పుకొచ్చింది తాన్యా. ఇక తమిళ సినిమా, తెలుగు సినిమా వేర్వేరుగా ఏమీ అనిపించలేదని చెప్పిన ఈ బ్యూటీ… రెండు పరిశ్రమలూ బాగా నచ్చాయని, అసలు కమర్షియల్ హీరోయిన్ అనే మాటకు నాకు అర్థం తెలియదని తెలిపింది.
Crime News: వరంగల్‌లో డ్రగ్స్ కలకలం.. తొలిసారిగా కోకైన్, చరస్ మత్తు పధార్థాలు సీజ్!
Tamara Movie: అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్.. డైరెక్టర్ ఎవరంటే….