RC 15: రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమాలో తన పాత్రపై తొలిసారి స్పందించిన ఎస్‌జే సూర్య.. ఏమన్నారంటే..

|

Sep 11, 2022 | 5:04 PM

RC 15: రామ్‌చరణ్‌ (Ramcharan), శంకర్‌ (Shanker) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి....

RC 15: రామ్‌చరణ్‌ - శంకర్‌ సినిమాలో తన పాత్రపై తొలిసారి స్పందించిన ఎస్‌జే సూర్య.. ఏమన్నారంటే..
Rc15 Movie
Follow us on

RC 15: రామ్‌చరణ్‌ (Ramcharan), శంకర్‌ (Shanker) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్‌ ఇండియాలో రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ నటిస్తోంది. తన ప్రతీ సినిమాను ఎంతో పకడ్బందీగా తెరకెక్కించే శంకర్‌.. ఈ సినిమా కోసం కూడా భారీ ప్లాన్‌లు వేస్తున్నారు. ఇందులో భాగంగానే భారీ క్యాస్టింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటన్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాలోకి విలక్షణ నటుడు ఎస్‌జీ సూర్యను తీసుకున్నారు.

ఇటీవలే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో సూర్య విలన్‌ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సూర్య ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే తాజాగా ఎస్‌జే సూర్య ట్విట్టర్‌ వేదికగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయమై సూర్య ట్వీట్ చేస్తూ.. ‘బాల నటుడిగా ఉన్నప్పటి నుంచి శంకర్‌ గారిని చూస్తున్నాను. స్నేహితుడు సినిమాలో చిన్న రోల్‌లో నటించినప్పుడు ఆయన ఎనర్జీ ఎలా ఉందో.. ఇప్పుడు ఆర్సీ15లో కూడా అదే ఎనర్జీ కనిపిస్తోంది. ఒక అభిమానిగా, నటుడిగా మీ నుంచి నేను చాలా నేర్చుకుంటాను సార్‌’ అంటూ రాసుకొచ్చారు. మరి ఇన్ని అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా అసలు కథ ఏంటి.? చెర్రీతో శంకర్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేయనున్నాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..