అప్పుడు చెర్రీ.. ఇప్పుడు డీఎస్పీ.. తమన్నా ఏంటమ్మా ఇది..!

| Edited By:

Jan 05, 2020 | 9:40 PM

మిల్కీ బ్యూటీ తమన్నా అదరగొట్టేసింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డాంగ్ డాంగ్ సాంగ్‌కు డ్యాన్స్ వేసి స్టేజ్‌పైన దుమ్ము దులిపింది. సినిమాలో ఈ పాట ఎలా ఉండబోతోందో ముందే మహేష్ ఫ్యాన్స్‌కు రుచి చూపించింది తమన్నా. ఇక డ్యాన్స్ తరువాత తమన్నా మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, హీరో, నిర్మాతలకు ధన్యవాదాలు అని చెప్పింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డ్యాన్స్ చేయాలని అడగ్గపోయినా.. తాను చేసేదానిని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. […]

అప్పుడు చెర్రీ.. ఇప్పుడు డీఎస్పీ.. తమన్నా ఏంటమ్మా ఇది..!
Follow us on

మిల్కీ బ్యూటీ తమన్నా అదరగొట్టేసింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డాంగ్ డాంగ్ సాంగ్‌కు డ్యాన్స్ వేసి స్టేజ్‌పైన దుమ్ము దులిపింది. సినిమాలో ఈ పాట ఎలా ఉండబోతోందో ముందే మహేష్ ఫ్యాన్స్‌కు రుచి చూపించింది తమన్నా. ఇక డ్యాన్స్ తరువాత తమన్నా మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, హీరో, నిర్మాతలకు ధన్యవాదాలు అని చెప్పింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డ్యాన్స్ చేయాలని అడగ్గపోయినా.. తాను చేసేదానిని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అయితే మాటల క్రమంలో కాస్త నోరు జారిపోయింది మిల్కీ బ్యూటీ. మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. డీఎస్పీ ఇంకేం చేస్తావు రా నువ్వు. ఇన్ని మంచి సాంగ్స్ తరువాత మేమేం చేయాలి అంటూ తన సాన్నిహిత్యాన్ని చాటుకుంది. అయితే అందరి ముందే తనను తమన్నా రేయ్ అనడంతో డీఎస్పీ కూడా కాస్త షాక్‌కు గురయ్యాడు.

అయితే గతంలో రామ్ చరణ్‌పై కూడా ఇలాంటి కామెంట్లే చేసింది తమన్నా. సైరా సక్సెస్‌మీట్‌లో మాట్లాడిన తమన్నా.. నిన్ను నిర్మాతగా చూడాలా..? హీరోగా చూడాలా..? ఏం చెప్పాలి రా నీ గురించి అంటూ ప్రేమగా మాట్లాడింది తమన్నా. ఆ సమయంలో అక్కడే చిరంజీవి ఉన్నా.. చెర్రీతో ఆమెకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా అలా మాటల రూపంలో చెప్పేసింది తమన్నా. అంతేకాదు చెర్రీ కూడా అప్పుడు కాస్త షాక్‌కు ఫీలయ్యాడు. అయితే ఎంత సాన్నిహిత్యం ఉన్నా అందరిలో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడుతుంటారు సెలబ్రిటీలు. కానీ తమన్నా మాత్రం అలా ఏం లేకుండా మాట్లాడేయడం గమనర్హం.