మొదట్లో చాలా బాధపడ్డాను.. నా కెరీర్ ముగిసిపోయిందన్నారు.. చెదు జ్ఞాపకాలను పంచుకున్న మిల్కీబ్యూటీ..

|

Jan 21, 2021 | 4:18 PM

తక్కువ కాలంలోనే అగ్రహీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటూ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది తమన్నా. ఇక

మొదట్లో చాలా బాధపడ్డాను.. నా కెరీర్ ముగిసిపోయిందన్నారు.. చెదు జ్ఞాపకాలను పంచుకున్న మిల్కీబ్యూటీ..
Follow us on

తక్కువ కాలంలోనే అగ్రహీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటూ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది తమన్నా. ఇక బహుబలి సినిమాతో తానెంటో మరోసారి నిరుపించుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి సైరా మూవీలో నటించింది. ఇక ఆ సినిమా తర్వాత అటు తెలుగులోనే వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ జోష్‏మీద ఉంది తమన్నా. తాజాగా తాను సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఎదురైన చెదు అనుభవాల గురించి వెల్లడించింది.

“నేను గతంలో జరిగిన విషయాలకు బాధపడను. వాటితో భవిష్యత్తును ఇంకా అందంగా మలచుకోవడానికి ప్రణాలికలు వేసుకోను. వర్తమానంలోనే జీవిస్తూ వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలతో తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుగు వెళ్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. అలాగే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో విమర్శలను, అపజయాలను తల్చుకొని చాలా బాధపడ్డాను. నా కెరీర్ ముగిసిపోయిందని, కష్టాల్లో ఉన్నాననే వార్తలు వచ్చాయని.. కానీ అవి నా ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేదు. అలాగే అవన్నీ నేను మరింత కష్టపడటానికి నాలో ప్రోత్సాహాన్ని నింపాయి. ప్రస్తుతం నంబర్ గేమ్స్, స్టార్ హీరోయిన్ అనే ముద్రలు లేవు. ఎవరైనా సరే కష్టపడాల్సిందే.. అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాం. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా. నా హార్ట్ వర్క్‏కు అదృష్టం కలవడంతోనే పదిహేనేళ్ళుగా ప్రేక్షకులను అలరిస్తున్నా” అంటూ చెప్పుకోచ్చింది. ప్రస్తుతం శింబు సరసన ‘ఏఏఏ’ చిత్రంలో నటిస్తోంది మిల్కీ బ్యూటీ. ఇందులో హీరోయిన్ శ్రియ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ మూవీ జనవరి 22న విడుదల కానుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలోనే ఓటీటీలోకి అరంగేంట్రం చేయబోతున్నది తమన్నా.

Also Read:

Hero Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ కామిక్ బుక్.. నెట్టింట్లో వైరల్‏గా మారిన పోస్టర్..

Ram Charan : రెండు సినిమా షూటింగ్స్ తో బిజీ అయిన మెగా పవర్ స్టార్.. డే అండ్ నైట్ షూట్స్ లో పాల్గొంటున్న చరణ్.