సుశాంత్ ఫొటోనే చూస్తూ.. కుక్క నిరీక్షణ.. గుండెల్ని పిండేస్తోన్న ఫొటోలు, వీడియోలు

| Edited By:

Jun 18, 2020 | 10:20 PM

విశ్వాసం అన్న పదానికి పర్యాయపదంగా కుక్కను ఊరికే పోల్చరు. అది చూపించే విశ్వాసాన్ని మరే జంతువు చూపించదు.

సుశాంత్ ఫొటోనే చూస్తూ.. కుక్క నిరీక్షణ.. గుండెల్ని పిండేస్తోన్న ఫొటోలు, వీడియోలు
Follow us on

విశ్వాసం అన్న పదానికి పర్యాయపదంగా కుక్కను ఊరికే చెప్పలేదు. అది చూపించే విశ్వాసాన్ని మరే జంతువు చూపించదు. అందుకే మనుషులను నమ్మలేని ఎంతో మంది కుక్కలను పెంచుకుంటుంటారు. వాటితో తమ అనుబంధాన్ని ముడిపెట్టుకుంటుంటారు. అయితే కుక్కలు కూడా తమ యజమానులపై అంతే ప్రేమను కలిగి ఉంటాయి. తన యజమాని కనిపించకపోతే అల్లాడుతుంటాయి. మాటలు రానప్పటికీ యజమానికి చూస్తే చాలు ఎగురుకుంటూ వెళ్లి తమ అభిమానాన్ని చాటుకుంటాయి. ఇక యజమాని చనిపోతే ఆ బాధను అవి కూడా భరించలేవు.  దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలను మనం నిజ జీవితంలో చూసే ఉంటాం.

ఇక ఇప్పుడు సుశాంత్ పెంపుడు కుక్క ఫెడ్జ్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. సుశాంత్ ఇక రాడు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్న ఫెడ్జ్‌ చాలా దిగాలైపోయింది. ఫోన్‌లో అతడి ఫొటోను చూస్తూ ‘నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్లావు. మళ్లీ ఎప్పుడు వస్తావు’ అన్నట్లుగా ముఖం పెట్టేసింది. ఇక వీడియోల్లో బాధపడుతూ ఇళ్లంతా కలయతిరుగుతూ అతడి రూమ్‌ దగ్గరకు వెళుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. తట్టుకోలేకపోతున్నాం అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాగా సుశాంత్ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయన ఇంట్లో ఐదు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మరోవైపు సుశాంత్ అస్తికలను కుటుంబసభ్యులు వారణాసిలో కలిపారు.

Read This Story Also: Happy Birthday Kajal: ఆసక్తిగా విష్ణు, కాజల్‌ల ‘మోసగాళ్లు’ లుక్‌