Sushant Singh former Flatmate Samuel: బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసు మిస్టరీ సినిమాను తలపిస్తోంది. మొదట ఇది ఆత్మహత్య అనుకున్నప్పటికీ.. ఎవరో కుట్ర చేసి సుశాంత్‌ని హత్య చేశారన్న అనుమానాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇదిలా ఉంటే సుశాంత్ సన్నిహితులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆ నటుడి గురించి చెబుతున్నారు. కొందరేమో సుశాంత్ డిప్రెషన్‌తో బాధపడేవాడని అంటుండగా.. మరికొందరేమో సుశాంత్ అలా ఎప్పుడూ లేడని అంటున్నారు. ఈ క్రమంలో సుశాంత్ గురించి మాజీ ఫ్లాట్‌మేట్ శామ్యూల్ హావోకిప్ కీలక విషయాలు వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శామ్యూల్.. తాను 2018 జూన్ నుంచి 2019 జూలై వరకు సుశాంత్‌తో ఉన్నానని వివరించారు. అంతేకాదు తాను సుశాంత్ పీఆర్వో టీమ్‌లో కూడా పనిచేశానని తెలిపారు. అయితే ఎల్‌ఎల్‌బీ పూర్తి కావడంతో సుశాంత్ టీమ్ నుంచి తాను బయటకు వచ్చినట్లు శామ్యూల్ పేర్కొన్నారు. ఇక సుశాంత్ డిప్రెషన్, బైపాల్ డిజార్డర్‌తో బాధపడేవాడా..? అన్న ప్రశ్నకు సుశాంత్ చాలా ప్రేమించే మనసున్న వ్యక్తి అని వెల్లడించారు. అంతేకాదు రియా తనకంటే సిద్ధార్థ్ పితానీతో క్లోజ్‌గా ఉండేదని శామ్యూల్ తెలిపారు.
ఇక సుశాంత్ మరణించిన రోజు తాను ఆయన స్నేహితులు, ఇంట్లో వారికి ఫోన్ చేస్తే ఎవరూ కాల్ లిఫ్ట్ చేయలేదని అన్నారు. సిద్ధార్థ్ పితానీకి ఫోన్ చేసినా ఫలితం లేకపోయిందని, అయితే ఏం జరిగిందన్న విషయాన్ని అతడు మెసేజ్‌లో తెలిపాడని శామ్యూల్ పేర్కొన్నారు. ”ఆ రోజు సుశాంత్ ఇంటి హెల్పర్ నీరజ్ మాత్రమే నా ఫోన్‌ని లిఫ్ట్ చేశాడు. అతడు కూడా మీడియాలో వచ్చిందే నాకు చెప్పాడు” అని శామ్యూల్ తెలిపారు. ఇక సుశాంత్ క్లోజ్ ఫ్రెండ్‌గా చెప్పుకునే సందీప్ ఎస్ సింగ్ ఎవరో తనకు తెలీదని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Read This Story Also: పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం