నా సినిమాలు చూడటానికి సిగ్గుపడుతుంటాను.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన తమిళ స్టార్ సూర్య..

|

Feb 07, 2021 | 6:35 PM

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. సూర్య చేసిన సినిమాలు తమిళంతోపాటు టాలీవుడ్‏లో విడుదలై మంచి గుర్తింపు సాధించాయి. ఇటీవల సూర్య నటించిన

నా సినిమాలు చూడటానికి సిగ్గుపడుతుంటాను.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన తమిళ స్టార్ సూర్య..
Follow us on

Actor Surya: తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. సూర్య చేసిన సినిమాలు తమిళంతోపాటు టాలీవుడ్‏లో విడుదలై మంచి గుర్తింపు సాధించాయి. ఇటీవల సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ హిట్‏తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు సూర్య. తాజాగా సూర్య తన సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

“నేను హీరోగా నటించిన సినిమాలను చూడడానికి చాలా సిగ్గు పడుతుంటాను. నా సినిమా రిలీజ్ అయిన వందరోజుల తర్వాత.. నేను ఆ మూవీ సందర్భాలు ఉన్నాయి. నేను నటించిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తే చూసి ఎంతో ఆనందిస్తుంటాను. ఇది నా ఫెవరేట్ మూవీ అని అప్పుడు చెబుతుంటాను. నా భార్య జ్యోతిక, నా తమ్ముడు కార్తి ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందినవారే. కానీ వాళ్ళిద్దరూ నాలాగా ఉండరు. కానీ వాళ్ళిద్దరు వాళ్లు చేసే పనిపై పూర్తి నమ్మకంతో ఉంటారు. చేసే పనిని పూర్తిగా ఇష్టపడి చేస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు. కొన్నిసార్లు నా పనిని నేను విమర్శించుకుంటాను. ఒక నటుడిగా నేను నా బెస్ట్ ఇవ్వలేదనుకుంటాను. ఇంకా బాగా పనిచేయాల్సి ఉంది అనుకుంటాను అంటూ సూర్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Also Read:

Megastar Chiranjeevi: ఆ డైరెక్టర్‏తోనే చిరంజీవి తర్వాతి సినిమా.. ‘ఉప్పెన’ వేదికపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..