AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య క్రేజ్ చూశారా!..215 అడుగుల క‌టౌట్

తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అవ్వబోతోంది అంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. కటౌట్లు, పాలాభిషేకాలు ఆ రచ్చ మాములుగా ఉండదు. ఇక తమిళనాడులో హీరోల ఫ్యాన్స్ గురించి స్పెషల్‌గా చెప్పాలా? వారు ప్రేమించినంతగా సినిమా వాళ్లను ఏ స్టేట్ వాళ్లు ప్రేమించరంటే అతిశయోక్తి కాదు. గుడులు కట్టిన దాఖలాలు కూడా కోకొల్లలు. అయితే తాజాగా ఓ హీరోకు ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 215 అడుగుల క‌టౌట్ పెడుతున్నారు ఫ్యాన్స్. అంత‌గా అభిమానుల‌ను సంపాదించుకున్న […]

సూర్య క్రేజ్ చూశారా!..215 అడుగుల క‌టౌట్
Ram Naramaneni
|

Updated on: May 19, 2019 | 7:56 PM

Share

తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అవ్వబోతోంది అంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. కటౌట్లు, పాలాభిషేకాలు ఆ రచ్చ మాములుగా ఉండదు. ఇక తమిళనాడులో హీరోల ఫ్యాన్స్ గురించి స్పెషల్‌గా చెప్పాలా? వారు ప్రేమించినంతగా సినిమా వాళ్లను ఏ స్టేట్ వాళ్లు ప్రేమించరంటే అతిశయోక్తి కాదు. గుడులు కట్టిన దాఖలాలు కూడా కోకొల్లలు.

అయితే తాజాగా ఓ హీరోకు ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 215 అడుగుల క‌టౌట్ పెడుతున్నారు ఫ్యాన్స్. అంత‌గా అభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ఎవ‌రో కాదు.. సూర్య‌. త‌మిళ‌నాట ఈయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.ఈ మ‌ధ్య కాలంలో ఒక్క హిట్ అంటూ త‌న టైమ్ కోసం చూస్తున్నాడు. వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపుల‌తో రేసులో బాగా వెన‌క‌బ‌డిపోయిన సూర్య‌.. ఇప్పుడు ఎన్జీకే సినిమాతో వ‌స్తున్నాడు. ఈ చిత్రం మే నెల 31న విడుదల కానుంది.  పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టించారు.

ఇక తిరుత్తణిలోని ఓ థియేట‌ర్ ద‌గ్గ‌ర సూర్య ఫ్యాన్స్ ఏకంగా ఆయ‌న‌కు 215 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప‌టికే దీన్ని కట్టడం సగం పూర్తైపోయింది. దీని కోసం ఆరున్న‌ర ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ మ‌ధ్య స‌ర్కార్ సినిమా విడుద‌ల స‌మ‌యంలో కూడా విజ‌య్ కోసం భారీ కటౌట్ ఏర్పాటు చేసారు ఫ్యాన్స్. ఇప్పుడు సూర్య‌కు కూడా ఇదే చేస్తున్నారు. ఏది ఏమైనా తమిళ అభియానులు తీరే వేరు.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌