AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam Trailer: అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. విరాట పర్వం ట్రైలర్‌ వచ్చేది ఆ రోజే..

Virata Parvam Trailer: రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం 'విరాటపర్వం'. నక్సలిజం నేపథ్యంలో రూపొందించిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'నీది నాది ఒకే కథ' సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న వేణు ఊడుగుల...

Virata Parvam Trailer: అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. విరాట పర్వం ట్రైలర్‌ వచ్చేది ఆ రోజే..
Narender Vaitla
|

Updated on: Jun 03, 2022 | 6:04 PM

Share

Virata Parvam Trailer: రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. నక్సలిజం నేపథ్యంలో రూపొందించిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోన కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుగమణిగిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా తేదీని ఎట్టకేలకు ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్‌ 17న ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని పాటలు, టీజర్లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రేక్షకులు ఎంతో కాలంగా సినిమా ట్రైలర్‌ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ చిత్ర యూనిట్‌ ఎట్టకేలకు ట్రైలర్‌ తేదీని ప్రకటించింది. విరాట పర్వం సినిమా ట్రైలర్‌ను జూన్‌ 5న తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రటించింది. 1990 సమయంలో తెలంగాణలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో రానా, సాయిపల్లవితో పాటు ప్రియమణి కీలకపాత్రలో నటిస్తోంది. ‘ప్రేమ విప్లవానికి అతిపెద్ద రూపం’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో చిత్ర యూనిట్‌ ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us