Latha Rajinikanth: రజనీకాంత్ రిటైర్మెంట్ పై స్పందించిన ఆయన సతీమణి.. ఏం చెప్పారంటే!

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తాజాగా ఆయన సతీమణి స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీ భర్త సినిమాల నుంచి విరామం తీసుకనే ఆలోచనలో ఏమైనా ఉన్నారా అంటూ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ... ఆవిషయం నాకు తెలిస్తే కచ్చితంగా మీకు చెప్పేదాన్ని అని అన్నారు.

Latha Rajinikanth: రజనీకాంత్ రిటైర్మెంట్ పై స్పందించిన ఆయన సతీమణి.. ఏం చెప్పారంటే!
Latha Rajinikanth

Updated on: May 05, 2025 | 4:04 PM

సూపర్‌ స్టార్ రజినీకాంత్ సౌత్‌ సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయకు ఉన్న క్రేజ్‌ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే వెట్టయాన్ సినిమాతో భారీ హిచ్‌ కొట్టిన ఆయన ప్రస్తుతం, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్‌-2 సినిమాలు చేస్తున్నారు. ఈ అయితే ఇందులో ఒక సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తి కాగా మరో సినిమాలో షూటింగ్‌లో రజినీ కాంత్‌ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా రజినీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్తలు సోషల్‌మీడియాతో పాటు సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ రూమర్స్‌పై తాజాగా ఆయన సతీమణి లత రజనీకాంత్ స్పందించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీ భర్త సినిమాల నుంచి విరామం తీసుకనే ఆలోచనలో ఏమైనా ఉన్నారా అంటూ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ… ఆవిషయం నాకు తెలిస్తే కచ్చితంగా మీకు చెప్పేదాన్ని అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..