Sarileru Neekevvaru: మహేష్ బాబు మాస్ సాంగ్ మైండ్ బ్లాక్ సరికొత్త రికార్డ్.. 100మిలియన్స్ వ్యూస్ పాట

| Edited By: Rajitha Chanti

Apr 25, 2021 | 11:12 AM

సూపర్ స్టార్ మాహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు మహేష్.

Sarileru Neekevvaru: మహేష్ బాబు మాస్ సాంగ్ మైండ్ బ్లాక్ సరికొత్త రికార్డ్.. 100మిలియన్స్ వ్యూస్ పాట
Follow us on

Sarileru Neekevvaru: సూపర్ స్టార్ మాహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు మహేష్. ప్రస్తుత సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్. ఇదిలా ఉంటే మహేష్ బాబు నటించిన’సరిలేరు నీకెవ్వరు’సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించి. ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలైన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విజువల్స్ `కొండారెడ్డి బురుజు`… `అల్లూరి సీతరామరాజు`, మహేష్ గారి నోట`చుక్క చెమట పట్టలేదు, నా చొక్కా గుండి ఊడలేదు` అనే మాటలు…`మైండ్ బ్లాక్` అంటూ ఆయన వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. తాజాగా ఈ సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని మాస్ డ్యూయెట్ ‘మైండ్ బ్లాక్’ సాంగ్ ఇటీవలే యూట్యూబ్ వేదికగా 100మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న సాంగ్స్ క్లబ్బులో చేరింది. ఈ పాటలో మహేష్ అదిరే డాన్సులతో పాటు హీరోయిన్ రష్మిక మందన అందాలు ప్రేక్షకులతో ఈలలు వేయించాయని చెప్పాలి. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల   నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Dhanush: ఓటీటీ వేదికగా ధనుష్ ‘జగమే తంతిరమ్’ సినిమా.. ఎప్పుడంటే

Pawan Kalyan: హాట్ టాపిక్ గా వకీల్ సాబ్ రెమ్యునరేషన్.. పవన్ ఎంత అందుకున్నారో తెలుసా..

Shyam Singha Roy : ‘కాళికాదేవి’ ఆలయం సెట్ లో నేచురల్ స్టార్ శ్యామ్ సింగ రాయ్ షూటింగ్..