Bandla Ganesh: బండ్ల గణేశ్.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి, నిర్మాతగా ఎదిగారు గణేశ్. భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించి స్టార్ ప్రొడ్యూసర్‌గా మారారు. సినిమాలతో నిత్యం వార్తల్లో నిలిచే బండ్ల.. సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌ల ద్వారా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్ట్‌లు కొన్నిసార్లు వైరల్ అవుతుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా బండ్ల గణేశ్ ట్వీట్ చేసిన ఓ ఆడియో క్లిప్ హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆయన ట్వీట్ చేసిన ఆడియోలో ఏముందంటే..
బండ్లగణేశ్ ఆడియోలో.. ‘జీవితంలో ఎవర్నీ నమ్మొద్దు. మనల్ని మనం నమ్ముకుందాం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నమ్ముకుందాం. మనల్ని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామిని, మన పిల్లల్ని ప్రేమిద్దాం. వాళ్లకి మంచి భవిష్యత్తుని, అందమైన జీవితాన్ని ఇద్దాం. ఎందుకంటే వాళ్లు మనపై కోటి ఆశలతో జీవిస్తున్నారు. కొన్నింటిపై ఇష్టాలు పెంచుకుని మన అనుకునే వాళ్లకి అన్యాయం చేయవద్దు’ అని చెప్పుకొచ్చాడు.
— BANDLA GANESH. (@ganeshbandla) June 18, 2022
బండ్ల గణేశ్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘అసలు ఏమైంది అన్నా.?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో గణేశ్ మాటల వెనకాల ఉన్న అసలు ఉద్దేశమంటన్న దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. అయితే ఈ ఆడియోను గమనిస్తే ఇది ఎవరినో ఉద్దేశించినట్లు అనిపించట్లేదు. ఇటీవల ట్రెండ్ అవుతోన్న పాడ్ కాస్ట్ ఆడియో అనే భావన కలుగుతోంది. ఇదిలా ఉంటే నిర్మాతగా రాణిస్తున్న సమయంలోనే బండ్ల గణేశ్ హీరోగా కూడా నటించిన విషయం తెలిసిందే. ‘డేగల బాజ్జీ’ సినిమాతో ప్రేక్షకులకు పలకరించాడు. ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత బండ్ల గణేశ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..