Anil Ravipudi: మెగా బ్రదర్స్‌తో స్టార్‌ డైరెక్టర్‌?.. ఫిల్మ్‌ నగర్‌లో ఆసక్తికర వార్త..

మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ స్పీడ్‌ మామలుగా లేదు. వరుసగా తమ సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నారు

Anil Ravipudi: మెగా బ్రదర్స్‌తో  స్టార్‌ డైరెక్టర్‌?.. ఫిల్మ్‌ నగర్‌లో ఆసక్తికర వార్త..

Updated on: Nov 28, 2021 | 6:43 PM

మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ స్పీడ్‌ మామలుగా లేదు. వరుసగా తమ సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి యువ హీరోలతో పోటీగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. ‘ఆచార్య’ తర్వాత ‘ గాడ్ ఫాదర్’, ‘భోళాశంకర్’ సినిమాల ఏకకాలంలో సెట్స్ మీదకు తీసుకెళ్లిన ఆయన.. కొద్ది రోజుల క్రితమే బాబీతో మరో సినిమాను ప్రకటించారు. మారుతి, త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా చిరు సినిమాలు చేయనున్నారని ఫిల్మ్‌ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా చిరంజీవి తాజాగా మరో దర్శకుడికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన అనిల్ రావిపూడి. దర్శకధీరుడు తర్వాత ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా.. సినిమాలు తెరకెక్కిస్తోన్న ఆయన మెగాస్టార్‌కు కథ వినిపించారట. చిరంజీవికి కూడా ఈ స్టోరీలైన్‌ బాగా నచ్చిందట.

పవన్‌తోనూ..
కాగా ప్రస్తుతం ‘ఎఫ్ 3’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు . వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత మెగాస్టార్‌ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లే యోచనలో అనిల్‌ ఉన్నారు. అప్పటిలోపు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, ‘భోళాశంకర్’ బాబీ చిత్రాల్ని పూర్తి చేస్తారు . కాగా మెగాస్టార్‌తో పాటు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ను కూడా డైరెక్ట్‌ చేయాలని ఉందని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడీ స్టార్‌ డైరెక్టర్‌. అందుకు తగ్గట్లే పవన్‌తో ‘వకీల్‌సాబ్‌’ తీసిన దిల్‌ రాజు ఈ కాంబినేషన్‌ను సెట్‌ చేయాలని చూస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read:

Radhe Shyam: “రాధే శ్యామ్” సినిమా నుంచి రాయబోయే సూపర్ సర్‌ప్రైజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాన్స్..

Ajith Kumar : 20 ఏళ్ల తర్వాత రీమేక్ కానున్న అజిత్ సూపర్ హిట్ సినిమా..

Nithya Menen: అందుకే నేనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన నిత్యామీనన్