Suma-Ravi Singing Talent: బుల్లి తెరపై యాంకర్స్ ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చింది సుమ. మల్టీటాలెంటెడ్ పర్సన్.. సుమ పాతికేళ్ల కెరీర్‌లో ఆమెతో పాటు వచ్చిన వారందరూ దాదాపు కనుమరుగైపోయారు. కానీ ఇప్పటికీ సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. బుల్లి తెరపై నెంబర్ 1 యాంకర్‌గా హవా కొనసాగిస్తూనే ఉంది. యాంకర్స్ అంటే ఫిమేల్స్ అనుకుంటున్న సమయంలో ప్రదీప్ తో పాటు రవి కూడా టాలెంటెడ్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సుమ మంచి వ్యాఖ్యాత మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్, నటి, సింగర్ విషయం అన్న సంగతి తెలిసిందే.. ఐతే తాజాగా రవి కూడా తనలో ఉన్న సింగర్ ను బయటకు తీశాడు. తాజాగా సుమ, రవి లు కలిసి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ప్రోగ్రాం ను హోస్ట్ చేస్తున్నారు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ షోకి మంచి రేటింగ్, రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ఈ షో ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టాలెంటెడ్ వ్యక్తులను పరిచయం చేస్తున్నారు. వారిలో ఉన్న ప్రతిభను పదిమందికి తెలిసేలా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం ప్రోమో విడుదల చేసారు. అందులో రవి, సుమ కొత్త టాలెంట్ చూపించారు. అదే వాళ్ల సింగింగ్ టాలెంట్. ఇదివరకే ఓ సినిమాలో కూడా పాడింది సుమ. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ఓ సినిమా లో అనసూయ స్పెషల్ సాంగ్ కి డ్యాన్స్ చేయగా సుమ ఆ పాటను పాడింది. తమన్ ఆమెతో పాడించాడు. అయితే యాంకర్ రవి మాత్రం పాడినపుడు ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరూ కలిసి పాట పాడారు. వీరిద్దరూ కలిసి పాడిన ఈ పాట ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read: ఆదర్శపత్ని సీతమ్మ పూర్వీకులు.. పుట్టిల్లు.. తనువు చాలించిన ప్రాంతాల గురించి తెలుసుకుందాం..