కోడి రామకృష్ణపై సోనూ సూద్ భావోద్వేగ పోస్ట్

| Edited By:

Feb 23, 2019 | 2:06 PM

అనారోగ్యంతో బాధపడుతూ టాలీవుడ్ లెజండరీ దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరో గొప్ప దర్శకుడిని టాలీవుడ్ కోల్పోయింది అంటూ వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా కోడి రామకృష్ణ మృతిపై స్పందించారు. ‘‘నాకు ఇష్టమైన దర్శకుడు మరణించాడన్న వార్త నన్ను చాలా బాధించింది. నా కెరీర్‌లో పెద్ద విజయం అరుంధతిని ఆయన నాకు ఇచ్చారు. ఆయన […]

కోడి రామకృష్ణపై సోనూ సూద్ భావోద్వేగ పోస్ట్
Follow us on

అనారోగ్యంతో బాధపడుతూ టాలీవుడ్ లెజండరీ దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరో గొప్ప దర్శకుడిని టాలీవుడ్ కోల్పోయింది అంటూ వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా కోడి రామకృష్ణ మృతిపై స్పందించారు.

‘‘నాకు ఇష్టమైన దర్శకుడు మరణించాడన్న వార్త నన్ను చాలా బాధించింది. నా కెరీర్‌లో పెద్ద విజయం అరుంధతిని ఆయన నాకు ఇచ్చారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. మిమ్మల్ని మిస్ అవుతున్నాం సర్. తెలుగు ఇండస్ట్రీ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. సెట్స్‌లో మీతో గడిపిన సమయం చాలా విలువైనది’’ అంటూ కోడి రామకృష్ణ మృతిపై సోనూ పోస్ట్ చేశారు.


ఆ తరువాత ఆయనతో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘‘అరుంధతిలో ఒక స్కెచ్ కోసం 71గంటలు కోడి రామకృష్ణ గారు పనిచేయడం నాకు గుర్తుంది. పగలు, రాత్రి తేడా లేకుండా ఆయన మూవీ కోసం చాలా కష్టపడ్డారు. సినిమాపై ఆయనకు ఉన్న ఇష్టం మమ్మల్ని మా కాళ్ల మీద నిలబడేలా చేసింది. ఆయన ఒక చెక్క బల్ల మీద కూర్చొని మమ్మల్ని డైరెక్ట్ చేసేవారు. లెజండ్’’ అంటూ భావోద్వేగ పోస్ట్‌ను చేశారు.