మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్‌.. ఈసారి ఏం చేశారంటే

కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే వలస కార్మికుల పట్ల దేవుడిగా వెలుగొందుతున్న ఈ రియల్ హీరో..

మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్‌.. ఈసారి ఏం చేశారంటే

Edited By:

Updated on: Jul 17, 2020 | 4:45 PM

కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే వలస కార్మికుల పట్ల దేవుడిగా వెలుగొందుతున్న ఈ రియల్ హీరో.. తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మహారాష్ట్ర పోలీసులకు 25వేల ఫేస్ షీల్డ్‌లను ఆయన దానం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌.. సోనూకు థ్యాంక్స్ చెప్పారు.

‘పోలీసుల కోసం 25వేల ఫేస్ షీల్డ్‌లను ఇచ్చిన సోనూసూద్‌కు ధన్యవాదాలు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక దీనికి స్పందించిన సోనూసూద్‌.. ‘మీ వ్యాఖ్యలు నన్ను కదిలించాయి. పోలీస్‌ సోదరీ సోదరీమణులే మన రియల్ హీరోలు. వారు చేస్తున్న సేవలకు నేను చేసే సాయం చాలా చిన్నది’ అని కామెంట్ పెట్టారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులకు సాయం చేసే విషయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఓ పుస్తకంగా రాస్తానని ఇటీవల సోనూసూద్ ప్రకటించిన విషయం తెలిసిందే.