Sonu Sood: అమ్మ మాటలతో ముందుకెళ్లా.. సినిమాలతో పేరొచ్చింది.. కానీ ‘సాయం’ సంతృప్తినిచ్చింది: సోనూసూద్

Sonu Sood Comments: కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్. వేలాది మందికి ఆహారం అందించడంతోపాటు వాహనాల్లో..

Sonu Sood: అమ్మ మాటలతో ముందుకెళ్లా.. సినిమాలతో పేరొచ్చింది.. కానీ ‘సాయం’ సంతృప్తినిచ్చింది: సోనూసూద్
వేలాదిమంది వలస కార్మికులను తమ సొంతగ్రామాలకు చేర్చి రియల్ హీరోగా మారాడు 

Updated on: Feb 17, 2021 | 9:58 PM

Sonu Sood Comments: కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్. వేలాది మందికి ఆహారం అందించడంతోపాటు వాహనాల్లో వారి ఇళ్లకు చేర్చి అందరి మన్ననలు పొందాడు. సినిమాల్లో చేసేది విలన్ పాత్రలే అయినప్పటికీ.. సాయం కావాలంటూ తనదగ్గరకు వచ్చినవారందరికీ.. ఇప్పటికీ సోనూసూద్‌ సాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా ముద్రవేసుకున్నాడు. ఈ క్రమంలో సోనూసూద్ తాను చేస్తున్న సాయంపై బుధవారం స్పందించాడు. కరోనా సమయంలో వలస కార్మికులు పడ్డ కష్టాలు చూసి చలించానని.. వారికి సాయం చేయాలని సంకల్పించుకున్నట్లు తెలిపాడు. దీనిలో భాగంగా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చానని తెలిపాడు.

కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం తనకు తేలిసిన కార్పోరేట్ సంస్థలతో సంప్రదించి రేండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సోనూసూద్ తెలిపాడు. ఈ కష్ట సమయంలో తనకు తోచిన సాయం చేస్తూ ముందుకు వేళ్లానని తెలిపాడు. ఎప్పుడూ తన అమ్మ చెబుతుండేదని.. నువ్వు ఒకరికి సహయం చేస్తే వారి నుంచి వచ్చే దివేనలు నీకు ఇంకా సంతోషాన్ని ఇస్తాయని.. తన అమ్మ చెప్పిన మాటలతో సేవ చేయాలని సంకల్పించుకున్నట్లు వెల్లడించాడు. అరుంధతి, గబ్బర్ సింగ్ సినిమాలతో తనకు మంచి పేరు వచ్చిందన్నాడు. కానీ కరోనా సమయంలో చేసిన సేవతో తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని రియల్ హీరో సోనూసూద్ అభిప్రాయపడ్డాడు.

Also Read:

K.G.F: Chapter 2 : ప్రశాంత్ నీల్ ను రిక్వెస్ట్ చేస్తున్న కేజీఎఫ్ అభిమానులు.. కారణం ఇదే..

Buchi Babu Sana: ఇల్లు కావాలా.. లేదా కారు కావాలా.? ‘ఉప్పెన’ దర్శకుడికి నిర్మాణ సంస్థ బంపరాఫర్.!