AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K.G.F: Chapter 2 : ప్రశాంత్ నీల్ ను రిక్వెస్ట్ చేస్తున్న కేజీఎఫ్ అభిమానులు.. కారణం ఇదే..

దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్ చాప్టర్‌ 2’ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా

K.G.F: Chapter 2 : ప్రశాంత్ నీల్ ను రిక్వెస్ట్ చేస్తున్న కేజీఎఫ్ అభిమానులు.. కారణం ఇదే..
Rajeev Rayala
|

Updated on: Feb 17, 2021 | 9:54 PM

Share

K.G.F: Chapter 2 : దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్ చాప్టర్‌ 2’ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జులై 16న వరల్డ్‌ వైడ్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో విలన్‌ అధీరాగా బాలీవుడ్ కండల వీరుడు సంజయ్‌ దత్‌ నటించడం కూడా ఈ సినిమాకు ప్లస్‌గా మారనుంది. ఇప్పటి వరకు సంజయ్‌ దత్ సౌత్ ఇండియా సినిమాలో చిన్న చిన్న గెస్ట్‌ రోల్స్‌ మాత్రమే చేశాడు తప్ప.. ఫుల్ల ఎంత్‌ విలన్‌గా నటించలేదు.. ఇక ఈ సినిమాతో ఆ పని చేయనున్నాడు సంజయ్ దత్ .అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో రూమర్‌ నెట్టింట్లో వైరల్ అవుతోంది. కేజీఎఫ్ చాప్టర్‌ 1 కి కొనసాగింపుగా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్‌ 2 సినిమాతో ఈ సిరీస్‌ కంచికి చేరనుందట. అవును కేజీఎఫ్ సిరీస్‌ లో కేజీఎఫ్ 2 నే అఖరు సినిమా అని ఇటు ఇండస్ట్రీలోనూ.. అటు సోషల్ మీడియాలోనూ.. చర్చ జరుగుతుంది. దీనికి కారణంకూడా లేకపోలేదు.. కేజీఎఫ్2 లో హీరో చనిపోతాడని అందువల్ల ఈ సిరీస్ కు శుభం కార్డు పడుతుందని గతంలో వార్తలు వచ్చాయి. దాంతో ఇప్పడు ఈ సిరీస్ తో కేజీఎఫ్ ముగుస్తుందని అన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఈ విషయం తెలిసిన కేజీఎఫ్ అభిమానులు  అలా జరగకూడదంటూ.. డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్  రెక్వెస్ట్ పెడుతూ.. వేడుకుంటున్నారు. రిక్వెస్ట్ లను పట్టించుకుని.. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్‌ 3 అంటాడో.. లేక లైట్ తీసుకుంటాడో చూడాలి మరి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

శృతి హాసన్ అనుకోని బెంగ పట్టుకుంది.. ముద్దుగుమ్మను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు .. కారణం ఇదే..

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్