సోనూసూద్ సాయం… హైదరాబాద్‌కు చెందిన ఫార్మా విద్యార్థినికి ఆపన్న హస్తం… ఏం చేశాడంటే…

| Edited By:

Dec 13, 2020 | 2:47 PM

అభినవ కర్ణుడు, సహాయార్థుల పాలిట దేవుడు సోనూసూద్ హైదరాబాద్‌కు చెందిన విద్యార్థినికి సాయం చేశాడు. తన గొప్ప హృదయాన్ని మరోసారి చాటుకున్నాడు.

సోనూసూద్ సాయం... హైదరాబాద్‌కు చెందిన ఫార్మా విద్యార్థినికి ఆపన్న హస్తం... ఏం చేశాడంటే...
Follow us on

అభినవ కర్ణుడు, సహాయార్థుల పాలిట దేవుడు సోనూసూద్ హైదరాబాద్‌కు చెందిన విద్యార్థినికి సాయం చేశాడు. తన గొప్ప హృదయాన్ని మరోసారి చాటుకున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ గ్రామానికి చెందిన దేవికారెడ్డి ఇబ్రహీంపట్నంలోని ‘గురునానక్‌ ఇనిస్టిట్యూషన్స్‌’లో ఫార్మా సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. గత సంవత్సరం కన్వీనర్‌ కోటాలో ఫార్మా.డి సీటు వచ్చింది. ఏడాదికి ఫీజు రూ.లక్షా 15వేలు చెల్లించాలి.

అతి కష్టం మీద…

కన్వీనర్‌ కోటా కావడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రభుత్వం నుంచి రూ.68వేలు ఇస్తోంది. మిగతా రూ.47 వేలు కాలేజీకి దేవికారెడ్డే చెల్లించాల్సి ఉంది. గత సంవత్సరం అతి కష్టం మీద చెల్లించిన దేవికారెడ్డి.. ఈసారి తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఆమె తండ్రి ఫర్టిలైజర్స్‌ షాపులో చిరుద్యోగి, తల్లి గృహిణి. కాగా, సోనూసూద్‌ తన తల్లి పేరుపై ఓ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్‌ ఇస్తామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేవికారెడ్డి, ట్విటర్లో సోనూసూద్‌కు తన కష్టాన్ని విన్నవించింది. తాను ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నట్లు, తమది పేద కుటుంబమని, సాయం చేయాలని కోరింది. దీనికి స్పందించిన సోనూససూద్ .. దేవికారెడ్డికి రూ.47వేలు ఫీజుతో పాటు, రూ.2,500 కలిపి రూ.49,500 చెక్కును యూనివర్శిటీ పేరుపై పంపారు. ఆ చెక్కును సోనూసూద్‌ అభిమాని గౌటే గణేశ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ అశోక్‌కుమార్‌కు అందజేశారు.