Sita Ramam: సీతారామం నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. హృదయాన్ని హత్తుకుంటోన్న సిరివెన్నెల లిరిక్స్‌..

Sita Ramam: దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం సీతారామం. హను రాఘవాపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. నేషనల్‌ క్రష్‌ రష్మిక...

Sita Ramam: సీతారామం నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. హృదయాన్ని హత్తుకుంటోన్న సిరివెన్నెల లిరిక్స్‌..

Updated on: Jul 19, 2022 | 6:50 AM

Sita Ramam: దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం సీతారామం. హను రాఘవాపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. నేషనల్‌ క్రష్‌ రష్మిక ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తుండడం, సుమంత్‌, తరున్‌ భాస్కర్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ వంటి నటులు స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై సినిమాను తెరకెక్కించడం కూడా ఈ చిత్రానికి బజ్‌ తెచ్చిపెట్టింది. సినిమాను ఆగస్టు 5న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా సినిమాలోని మూడవ లిరిక్స్‌ సాంగ్‌ను విడుదల చేసింది.

‘కానున్న కళ్యాణం’ అనే లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. ప్రోమోతోనే మెస్మరైజ్‌ చేసిన ఈ పాట, పూర్తి లిరికల్ వీడియో శ్రోతలను ఆకట్టుకుంటోంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన సాహిత్యం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఇక విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌ కంపోజింగ్ అద్భుతంగా ఉంది. అలాగే పాటను చిత్రీకరించిన లొకేషన్స్‌ రిచ్‌ లుక్‌ తీసుకొచ్చాయి. దుల్కర్‌, మృణాల్‌ల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తోంది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…