గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన సింగర్ మనో .. అనంతరం ఆ ముగ్గురికి ఛాలెంజ్

|

Dec 12, 2020 | 11:46 AM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు సినీ సంగీత దర్శకుడు కోఠి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను సింగర్ మనుస్వీకరించారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన సింగర్ మనో .. అనంతరం ఆ ముగ్గురికి ఛాలెంజ్
Follow us on

 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు సినీ సంగీత దర్శకుడు కోఠి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను సింగర్ మనో స్వీకరించారు. ఈ సందర్భమగా ఆయన గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా మనో మాట్లాడుతూ..ఆయువు లేనిదే మనిషే లేడు – ఆయువును ఇచ్చేది పచ్చని మొక్క అని తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మను అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు  కృతజ్ఞతలు తెలిపిన సింగర్ మనో.. అనంతరం మరో ముగ్గురు సింగర్స్ ( చిత్ర , సుజాత , శ్వేతా మోహన్ )లు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.