నా తండ్రికి డ్రగ్స్‌కు అలవాటు ఉంది. కానీ.. సంజయ్ దత్‌పై ఆయన కుమార్తె సంచనల వ్యాఖ్యలు..
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌పై ఆయన కుమార్తె సంచనల వ్యాఖ్యలు చేశారు. సంజు డ్రగ్స్‌కి బానిస కావడం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్‌కు ఎదగడం వరకు
Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌పై ఆయన కుమార్తె సంచనల వ్యాఖ్యలు చేశారు. సంజు డ్రగ్స్‌కి బానిస కావడం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్‌కు ఎదగడం వరకు అన్ని విషయాలు తెలిసినవే. అంతేకాకుండా ఈ బాలీవుడ్ హీరో బయోపిక్‌ను కూడా “సంజు” పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడినా.. దానిని విజయవంతంగా జయించారు. కాగా సంజత్ దత్ డ్రగ్స్ అలవాటు గురించి తాజా ఆయన కుమర్తె త్రిషాలా దత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “గతంలో నా తండ్రి డ్రగ్స్‌కు అలవాటు పడినా.. ప్రస్తుతం దాని నుంచి బయటపడ్డారు. డ్రగ్స్ తీసుకోకపోయినప్పటికీ ప్రతిరోజూ పోరాడాల్సిన సమస్య వచ్చింది. తనకు తానుగా డ్రగ్స్ తీసుకుంటున్నానని ఒప్పుకోవడమే కాకుండా, దాని నుంచి బయటపడటానికి సహాయం కోరారు. నా తండ్రి విషయంలో నేనేమి సిగ్గు పడడం లేదు” అని త్రిషాలా అన్నారు.