Bigg Boss 5: బిగ్‌బాస్‌ హోస్ట్‌ మారనున్నారా..? రంగంలోకి దిగనున్న శృతీ హాసన్‌.. కారణం ఏంటో తెలుసా.?

Bigg Boss 5: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌లో 5 రోజులు ఒకేత్తు అయితే శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే వీకెండ్ ఎపిసోడ్స్‌ మరో ఎత్తు అని చెప్పాలి. దారి తప్పుతోన్న హౌజ్‌మేట్స్‌ను...

Bigg Boss 5: బిగ్‌బాస్‌ హోస్ట్‌ మారనున్నారా..? రంగంలోకి దిగనున్న శృతీ హాసన్‌.. కారణం ఏంటో తెలుసా.?
Biggboss 5

Updated on: Nov 23, 2021 | 7:58 AM

Bigg Boss 5: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌లో 5 రోజులు ఒకేత్తు అయితే శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే వీకెండ్ ఎపిసోడ్స్‌ మరో ఎత్తు అని చెప్పాలి. దారి తప్పుతోన్న హౌజ్‌మేట్స్‌ను సెట్‌ చేయాలన్నా, రకరకల టాస్క్‌లతో హౌజ్‌ మేట్స్‌కి సంతోషాన్ని పంచాలన్నా అది బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వ్యవహరించే వారికే దక్కుతుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో హోస్ట్‌లు ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు హోస్ట్‌లు అందుబాటులో లేకపోతే వారి స్థానంలో మరొకరు బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వ్యవహరించిన సందర్భాలు చూసే ఉంటాం. తెలుగులో నాగార్జున సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటే సమంత హోస్ట్‌గా వ్యవహరించి విషయం తెలిసిందే.

అయితే తాజాగా తమిళ బిగ్‌బాస్‌లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఇటీవల అమెరికా టూర్‌ వెళ్లొచ్చిన కమల్‌ హాసన్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో రెండు వారాల పాటు కమల్‌ బిగ్‌బాస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే కమల్‌ స్థానంలో నటీమణి, కమల్‌ కూతురు శృతీ హాసన్‌ను తీసుకొచ్చేందుకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. శృతీ హాసన్‌ అయితే బాగుంటుందని భావిస్తోన్న షో నిర్వాహకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్‌. మరి కమల్‌ స్థానాన్ని ఎవరు రీప్లేస్‌ చేస్తారో చూడాలి.

Also Read: Viral Photos: ప్రపంచంలోని 5 ప్రమాదకరమైన రైల్వే ట్రాక్‌లు.. మీరెప్పుడైనా చూశారా.. లేకపోతే ఇప్పుడు చూడండి..

Zodiac Signs: ఈ 3 రాశుల వారు చంచల స్వభావాన్ని కలిగి ఉంటారట.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతోన్న గోల్డ్‌ రేట్స్‌.. తులం ధర ఎంత ఉందంటే..