సుశాంత్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించిన ఆసుపత్రికి షోకాజ్ నోటీసులు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా సుశాంత్‌కి పోస్ట్‌మార్టం

Sushant Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా సుశాంత్‌కి పోస్ట్‌మార్టం చేసిన కూపర్ ఆసుపత్రి యాజమాన్యానికి మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుశాంత్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించే సమయంలో రియా అక్కడ ఎందుకు ఉందని, ఆమెకు ఎందుకు అనుమతించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
దీనిపై మానవ హక్కుల కమిషన్ చీఫ్ సయీద్ మాట్లాడుతూ.. కూపర్ ఆసుపత్రిలోని మార్చురీ రూమ్‌కు రియా వెళుతున్న పలు దృశ్యాలను చూశాను. ఏ నియమాల కింద ఆమెకు అనుమతిని ఇచ్చారు. ఈ విషయాన్ని మేము సీరియస్‌గా పరిగణిస్తున్నాం. ఆగష్టు 31న దీనిపై విచారణ చేస్తాం అని అన్నారు.
కాగా జూన్ 14న సుశాంత్ మరణించగా, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో రియా మార్చురీకి వెళ్లింది. అయితే మార్చురీలోకి కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతిని ఇస్తారని మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆమెకు అనుమతి ఎలా లభించిందని మానవ హక్కుల కమిషన్ ఆఫీసర్ ప్రశ్నించారు. ఏ సంబంధంతో ఆమె అక్కడకు వెళ్లిందని ఆయన అంటున్నారు. దీనిపై న్యాయపరంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో పోలీసులు కూడా తదుపరి చర్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది అని అన్నారు. మరోవైపు దీనిపై బీఎంసీ ఆఫీసర్ మాట్లాడుతూ తమకు ఇంకా నోటీసులు అందలేదని వెల్లడించారు.
Read More:



