ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడితో మరోసారి మహేష్‌.. నిజమేనా!

స్టార్ హీరోలు అందరికీ అవకాశం ఇవ్వరు. ఎంతో నమ్మకం ఉంటేనే ఎవరికైనా వారు అవకాశం ఇస్తారు. టాప్ దర్శకులైనా సరే కథ నచ్చక సినిమాలు

ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడితో మరోసారి మహేష్‌.. నిజమేనా!
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2020 | 1:13 PM

Mahesh Babu News: స్టార్ హీరోలు అందరికీ అవకాశం ఇవ్వరు. ఎంతో నమ్మకం ఉంటేనే ఎవరికైనా వారు అవకాశం ఇస్తారు. టాప్ దర్శకులైనా సరే కథ నచ్చక సినిమాలు వదులుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. అలా ఇచ్చిన అవకాశాన్ని ఎవరైనా సరిగా వినియోగించుకోకపోతే వారితో మరోసారి పనిచేసేందుకు కాస్త ఆలోచిస్తుంటారు. అయితే సూపర్‌స్టార్‌ మహేష్ బాబు మాత్రం ఇలాంటివి పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. కథ నచ్చితే చాలు గతంలో వారు ఫ్లాప్‌లు ఇచ్చినా వారి సినిమాల్లో నటించేందుకు ఓకే చెబుతుంటారు. ఇలా గతంలో ఇద్దరు, ముగ్గురు దర్శకులు మహేష్‌తో రెండోసారి సినిమాను తీయగలిగారు. ఇక తాజా సమాచారం ప్రకారం గతంలో మహేష్‌కు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు మరోసారి అతడితో పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరంటే మురగదాస్‌.

కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న ఈ దర్శకుడు ఆ మధ్యన మహేష్‌తో స్పైడర్ సినిమాను తెరకెక్కించారు. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది. అందులోని కొన్ని సన్నివేశాలపై ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు మహేష్‌తో మరో మూవీని తీయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం విజయ్‌తో తుఫాకి 2ని ఫిక్స్ చేసుకున్న మురగదాస్, ఈ ప్రాజెక్ట్‌ తరువాత మహేష్‌తో సినిమా తీయాలని అనుకుంటున్నారట. ఇందుకోసం కథను రాసుకొని, మహేష్‌కి వినిపించినట్లు కూడా తెలుస్తోంది. మరి ఈ కథను మహేష్ ఓకే చెప్పారా..? మురగదాస్ దర్శకత్వంలో మహేష్ రెండోసారి నటించనున్నారా..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read More:

మా అమ్మ కోరిక నెరవేరబోతోంది: చెర్రీ

‘జబర్దస్త్’‌లో సుడిగారి సుధీర్ కనిపించడా..!