Rawalpindi Express: షోయబ్ అక్తర్ బయోపిక్‌ ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ ఇక లేనట్లే.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

|

Jan 22, 2023 | 3:12 PM

పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయబ్ అక్తర్ (47) తన బయోపిక్ 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' నుంచి వైదొలుగుతున్నట్లు కీలక ప్రకటన వెలువరించాడు. ఒప్పందం ఉల్లంఘనలు జరిగాయని, అందువల్లనే ఈ సినిమా నుంచి వైదొలుగుతున్నట్లు స్వయంగా..

Rawalpindi Express: షోయబ్ అక్తర్ బయోపిక్‌ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఇక లేనట్లే.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
Shoaib Akhtar
Follow us on

పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయబ్ అక్తర్ (47) తన బయోపిక్ ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ నుంచి వైదొలుగుతున్నట్లు కీలక ప్రకటన వెలువరించాడు. ఒప్పందం ఉల్లంఘనలు జరిగాయని, అందువల్లనే ఈ సినిమా నుంచి వైదొలుగుతున్నట్లు స్వయంగా శనివారం (జనవరి 21) తన సోషల్‌ మీడియా ఖాతాలో వెల్లడించాడు. తన బయోపిక్‌కు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు అక్తర్ తన పోస్టులో వివరించాడు. మేనేజ్‌మెంట్‌, లీగల్ టీమ్‌లతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. ఈ సినిమాని కొనసాగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, తన పేరునుగానీ, తన జీవితంలోని సంఘటనలనుగానీ ఉపయోగిస్తే చిత్ర నిర్మాతలపై కఠినమైన చర్యలు తీసుకుంటానని తెలిపాడు.

‘చాలా విచారకరంగా ఉంది. నెలల తరబడి ఆలోచించిన తర్వాత నా లీగల్ టీమ్ ద్వారా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాను. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనిలో కొనసాగడానికి చాలా ప్రయత్నించాను. కానీ దురదృష్టవశాత్తు అంతా అనుకున్నట్లు జరగలేదు. అభిప్రాయాలను సామరస్యంగా పరిష్కరించడంలో వైఫల్యం, ఒప్పంద ఉల్లంఘనల ఫలితంగా చిత్ర యూనిట్‌తో సంబంధాలను తెంచుకున్నాను. నా బయోపిక్‌ కథపై హక్కులను చట్టపరంగా రద్దు చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించాను’ అని షోయబ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా షోయబ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ను తన జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్నట్లు గత ఏడాది జులైలో ప్రకటించారు. ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్ – రన్నింగ్ ఎగైనెస్ట్ ది ఆడ్స్’ అనే టైటిల్‌తో ఈ ఏడాది నవంబర్‌ 13న విడుదల కావాల్సి ఉంది. అంతాఅనుకున్నట్లు జరిగి ఉంటే పాకిస్తానీ క్రీడాకారుడు నటించిన మొట్టమొదటి విదేశీ చిత్రం ఇదే అవుతుందని కూడా షోయబ్ అప్పట్లో ప్రకటించాడు. అయితే ఇంతలో అక్తర్‌ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంటూ సోషల్‌ మీడియాలో ప్రకటన చేశాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.