హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గెరెతో స్టేజ్‌పై కిస్సింగ్ వివాదంలో నటి శిల్పాశెట్టికి ముంబై కోర్టులో ఊరట లభించింది. శిల్పాశెట్టి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ముంబై సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించింది. స్టేజ్‌పై ముద్దుపెట్టింది రిచర్డ్ గెరె అని శిల్పా శెట్టి కాదని న్యాయస్థానం ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఏప్రిల్ 7 , 2007లో ఢిల్లీలో ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమానికి శిల్పాశెట్టితో పాటు రిచర్డ్ గెరె హాజరయ్యారు.
అయితే ఈ సందర్భంగా శిల్పాశెట్టికి రిచర్డ్ ముద్దుపెట్టడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే ముద్దుతో ఎయిడ్స్ వ్యాపించదన్న సందేశాన్ని ఇవ్వడానికి స్టేజ్‌పై తాను అలా చేసినట్టు వివరణ ఇచ్చారు రిచర్డ్ గెరె. శిల్పాశెట్టి , రిచర్డ్ గెరె ప్రవర్తన చాలా అసభ్యంగా ఉందని అప్పట్లో రాజస్థాన్‌తో పాటు ముంబైలో కేసులు నమోదయ్యాయి. అయితే చీప్ పబ్లిసిటీ కోసమే తనపై కేసు పెట్టారని కౌంటరిచ్చారు శిల్పాశెట్టి. కానీ శిల్పాశెట్టి అసభ్యంగా ప్రవర్తించినట్టు పిటిషనర్లు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని ముంబై సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించింది. బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం నేరమన్న పోలీసుల వాదనతో కూడా ముంబై సెషన్స్ కోర్టు ఏకీభవించలేదు.
ఇదిలా ఉంటే గతేడాది కూడా ఈ ముద్దు వివాదంలో శిల్పా శెట్టికి ఊరట లభించింది. పదిహేనేళ్ల బహిరంగ ముద్దు వివాదంలో శిల్పా నిందితురాలిగా కేసు నమోదైంది. అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిగిన కోర్డు ఈ విషయంలో శిల్పానే బాధితురాలని తేల్చి చెప్పింది. ఇక తాజాగా శిల్పాశెట్టి అసభ్యంగా ప్రవర్తించినట్లు పిటిషనర్లు ఆధారాలు చూపలేకపోయానని కోర్టు తీర్పునివ్వడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..