
యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో సుధీర్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘రణరంగం’. ఈ సినిమాలో శర్వానంద్ పూర్తి మాస్‌లుక్‌లో కనబడనున్నాడు. అయితే ఈ మధ్యే శర్వానంద్ గాయపడడంతో కొద్దిరోజులు షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే శర్వా త్వరగా కోలుకోవడంతో షూటింగ్ మళ్ళీ ప్రారంభంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా టీజర్‌ను ఇవాళ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేశారు.
శర్వా మాస్ అట్రాక్టివ్ యాక్షన్ లో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ ల డైలాగ్స్‌తో టీజర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో దర్శనమివ్వనున్నాడు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ పిళ్ళై అందిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.