‘మత’ వివాదంలో షారూక్.. తప్పేంటన్న సీనియర్ నటి..!

బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ మళ్లీ ‘మత’ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ఓ వర్గం విరుచుకుపడుతోంది. అయితే ఈ దీపావళిని పురస్కరించుకొని షారూక్ ఖాన్ సోషల్ మీడియాలో తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. అందులో తన భార్య గౌరీ ఖాన్, కుమారుడు అబ్రమ్‌లతో కలిసి ఉన్న షారూక్.. సింధూరంను తన నుదిట ధరించాడు. ఇదే కొంతమంది ముస్లింలకు ఆగ్రహం తెప్పించింది. #HappyDiwali to everyone. May your lives be lit up […]

మత వివాదంలో షారూక్.. తప్పేంటన్న సీనియర్ నటి..!

Edited By:

Updated on: Oct 28, 2019 | 4:51 PM

బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ మళ్లీ ‘మత’ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ఓ వర్గం విరుచుకుపడుతోంది. అయితే ఈ దీపావళిని పురస్కరించుకొని షారూక్ ఖాన్ సోషల్ మీడియాలో తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. అందులో తన భార్య గౌరీ ఖాన్, కుమారుడు అబ్రమ్‌లతో కలిసి ఉన్న షారూక్.. సింధూరంను తన నుదిట ధరించాడు. ఇదే కొంతమంది ముస్లింలకు ఆగ్రహం తెప్పించింది.

‘‘నువ్వు అసలు ముస్లింవేనా..?’’. ‘‘నువ్వు ఫేక్ ముస్లింవు’’.. ‘‘ఓ ముస్లిం అయి ఉండి ఇలా చేస్తున్నావు. నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది’’.. ‘‘నీ డబుల్ స్టాండర్స్‌ను చూపిస్తున్నావు’’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఇలాంటి కామెంట్లు షారూక్‌కు కొత్తేం కాదు. గతంలోనూ పలు హిందూ పండుగలను ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు కూడా ఇలాంటి కామెంట్లే వినిపించాయి. ఇదంతా అలవాటైన షారూక్.. ఈసారి కూడా నెటిజన్ల కామెంట్లను ఏం పట్టించుకోకుండా సైలెంట్‌గా ఉన్నారు.

అయితే షారూక్‌పై వస్తోన్న నెగిటివ్ ట్రోలింగ్‌పై బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ స్పందించారు. ‘‘నుదుటిన తిలకాన్ని ధరించి.. దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు షారూక్‌ను టార్గెట్ చేస్తూ ఫేక్ ముస్లిం అంటూ వస్తోన్న ట్వీట్లను చూస్తుంటే భయమేస్తోంది. అందమైన భారతీయ సంస్కృతి, ఇస్లాంను ఎప్పుడూ భయపెట్టాలనుకోదు. భారతదేశం అందమంతా గంగా యమునా సంస్కృతిలోనే ఉంటుంది’’ అని ఆమె ట్వీట్ చేశారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.