‘మన్నత్‌’ని అమ్మేస్తున్నారా.. కింగ్‌ఖాన్ రిప్లై అదుర్స్‌

బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్‌ ఎంత మంచి నటుడో, అంత గొప్ప చమత్కారుడు కూడా. ఎదుటివారిని నొప్పించకుండా ఆయన హాస్యం చేయగలరు

  • Tv9 Telugu
  • Publish Date - 1:03 pm, Wed, 28 October 20
'మన్నత్‌'ని అమ్మేస్తున్నారా.. కింగ్‌ఖాన్ రిప్లై అదుర్స్‌

Shah Rukh Khan reply: బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్‌ ఎంత మంచి నటుడో, అంత గొప్ప చమత్కారుడు కూడా. ఎదుటివారిని నొప్పించకుండా ఆయన హాస్యం చేయగలరు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్‌కి ఆయన ఇచ్చిన రిప్లైని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. మీ సమయస్పూర్తి అదుర్స్ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో షారూక్‌ అప్పుడప్పుడు అభిమానులతో చాట్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ట్విట్టర్‌లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వాసిమ్‌ అనే ఓ నెటిజన్‌.. భాయ్‌ మన్నత్‌ని అమ్మేస్తున్నారా..? అని అడిగారు.(కరోనా అని తెలిసిన వెంటనే ఆందోళనకు గురయ్యా: నాగబాబు)

దానికి స్పందించిన నెటిజన్‌.. మన్నత్‌ని ఎప్పుడూ ఎవరు అమ్మలేరు. ఇస్తారు. ఈ విషయం గుర్తు పెట్టుకుంటే జీవితంలో నువ్వు అనుకున్నవి సాధించగలవు అని కామెంట్‌ పెట్టారు. కాగా మన్నత్‌ అంటే వాగ్దానం అన్న అర్థంలో షారూక్ ఈ విధంగా రిప్లై ఇచ్చారు. దీంతో ఆయన సమయస్పూర్తికి అందరూ వావ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ముంబయిలో ఉన్న మన్నత్‌ షారూక్‌కి ఉన్న స్థిరాస్తుల్లో ఒకటి. అంతేకాదు ఇదే అత్యంత ఖరీదైనది. దీని ఖరీదు దాదాపు రూ.200కోట్లు ఉంటుందని అంచనా. సముద్ర తీరాన ఆహ్లాద వాతావరణంలో మన్నత్‌ ఉంటుంది. షూటింగ్‌లలో ఎంత బిజీగా ఉన్న ప్రతి ఏడాది తన పుట్టినరోజు నాడు మాత్రం మన్నత్‌లో ఉంటారు షారూక్‌. ఇక ఆయనను చూసేందుకు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రతి ఏడాది వేల సంఖ్యలో అభిమానులు మన్నత్‌కి వెళ్లే విషయం తెలిసిందే.(విక్రమ్ ‘కోబ్రా’: ఇర్ఫాన్ పఠాన్ ఫస్ట్‌లుక్‌ విడుదల.. అదిరిపోయాడుగా)