AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sheena bora: షీనా బోరా హత్య కేసుకు దృశ్య రూపం.. ప్రముఖ ఓటీటీ వేదికగా..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇలాంటి ఓ కేసుకు తాజాగా దృశ్యరూపం ఇవ్వనున్నారు. షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంతలి అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడీ హత్యా ఉదంతానికి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ప్లాఫ్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా...

Sheena bora: షీనా బోరా హత్య కేసుకు దృశ్య రూపం.. ప్రముఖ ఓటీటీ వేదికగా..
Sheena Bora
Narender Vaitla
|

Updated on: Jan 29, 2024 | 2:30 PM

Share

నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కడం ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. అయితే ఒకప్పుడు ఇది కేవలం బయోపిక్‌లకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిజ జీవితంలో జరిగిన నేరాలకు సైతం దృశ్యరూపాన్ని ఇస్తున్నారు. వెబ్‌ సిరీస్‌ల రూపంలో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. ముఖ్యంగా డాక్యుమెంటరీలకు మంచి ఆదరణ లభిస్తుండంతో మేకర్స్ ఓటీటీలో తెగ విడుదల చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇలాంటి ఓ కేసుకు తాజాగా దృశ్యరూపం ఇవ్వనున్నారు. షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంతలి అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడీ హత్యా ఉదంతానికి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ప్లాఫ్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా షీనా బోరా హత్య కేసుకు సంబంధించిన డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్‌ అధికారికంగా ప్రకటించింది. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్‌ ట్రూత్‌’ పేరుతో ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ డాక్యుమెంటరీని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాష‌ల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇంతకీ ఏంటీ షీనా బోరా హత్య కేసు..

2015లో వెలుగులోకి వచ్చిన షీనా బోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే షీనా హత్య 2012లో జరిగింది. కన్నతల్లే సొంత బిడ్డను చంపేసిందన్న విషయం తెలిసిన దేశ ప్రజలకు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఆమె డ్రైవర్‌ శ్యాంవర్‌ రాయ్‌, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాలతో కలిసి కారులో గొంతుకోసి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీకి జైలు శిక్ష విధించారు. ఆరున్నరేళ్లు జైలు జీవితాన్ని గడిపిన ఇంద్రాణి.. 2022 మే నెలలో జైలు నుంచి విడుదలయ్యారు.

ఇక ఈ హత్య కేసు వెనకాల ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. దర్యాప్తులో ఎన్నో సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంద్రాణీ ముఖర్జీ మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను తల్లిదండ్రుల వద్ద ఉంచి. సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే అతని నుంచి కూడా విడిపోయి.. తర్వాత పీటర్‌ ముఖర్జియాను పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల తర్వాత షీనా అసలు విషయం తెలుసుకొని తల్లిని కలవడానికి ముంబయి వెళ్లింది.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

అక్కడ పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనాకు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ఈ విషయంలో తల్లీకుమార్తెల మధ్య తరచూ గొడవలు జరిగాయి. అంతేకాకుండా ఇద్దరి మధ్య ఆర్థిక విభేధాలు తలెత్తాయి. దీంతో ఇంద్రాణీ.. తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌తో కలిసి కూతురును హత్య చేయించింది. ఈ కేసులో ఇంద్రాణీ, సంజీవ్‌లతో పాటు పీటర్‌ని కూడా అరెస్టు చేశారు. జైల్లోనే ఇంద్రాణీ – పీటర్ వివాహ బంధానికి ముగింపు పడింది. 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..