Ram Gopal varma: ‘అమ్మాయిలను చూడాలంటేనే భయం’.. సంచలన దర్శకుడు ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Ram Gopal varma: రామ్‌గోపాల్ వర్మ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే అక్కడ వర్మ పేరు వినిపిస్తుంది. మనసులో ఉన్న భావాలను ఎలాంటి దాపరికం లేకుండా, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం వర్మకు..
Ram Gopal varma: రామ్‌గోపాల్ వర్మ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే అక్కడ వర్మ పేరు వినిపిస్తుంది. మనసులో ఉన్న భావాలను ఎలాంటి దాపరికం లేకుండా, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం వర్మకు మాత్రే చెల్లుతుంది. ఎదుటి వారు ఏమనుకుంటారు.? ఆ విషయం చెప్పడం వల్ల తన ఇమేజ్‌కు ఏమైనా డ్యామేజ్ అవుతుందా.? ఇలాంటి ఏ ఆలోచనలు లేకుండా నచ్చింది చేసుకుంటూ పోతుంటారు వర్మ. ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడే ఆర్జీవీ తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు.
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మా ఇష్టం’ ఈ నెల 6న విడుదల కానుంది. మొదటి నుంచి కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారిన ఈ సినిమా వాయిదా పడి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మంగళవారం ‘ఆస్క్ మి ఎనీథింగ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. తనకు కాలేజ్‌లో చదివే రోజుల్లో అమ్మాయిలను చూడాలంటే భయం వేసేదని తెలిపారు. ఎప్పుడైనా ఓరకంటితో చూసేవాడినని, కానీ ఇప్పుడు తాను మారిపోయానని, నైనా, అప్సర లాంటి అందమైన అమ్మాయిలను జీవితానికి సరిపడేంత సమయం చూశానని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని వర్మ.. ఇది సక్సెస్ కాకపోతే ఇంకేంటి.? అంటూ వ్యాఖ్యానించారు.
ఇక మా ఇష్టం సినిమా గురించి వర్మ మాట్లాడుతూ.. ‘సమాజానికి ఏదో సందేశం ఇద్దామనే ఉద్దేశంతో ‘మా ఇష్టం’ని తీయలేదు. నిన్న ఏదో అయిపోయింది.. రేపు ఏం జరుగుతుందో తెలియదు.. అందుకే ఈరోజు బతికేయాలన్నది నా ఫిలాసఫీ. నాకంటే డబ్బులు, పేరు ఉన్నవారు, కమర్షియల్ సక్సెస్ ఉన్నవారు ఉండొచ్చు. కానీ వాళ్లందరికంటే నేనే ఎక్కువగా నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నాను’ అని తన ఫిలాసఫీని కుండ బద్దలు కొట్టినట్లు తెలిపారు వర్మ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: IPL 2022: వైడ్ల నిర్ణయంపైనా డీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలి.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ వెటోరి..
Smart Phone: స్మార్ట్‌ఫోన్ కొంటున్నారాా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..