IPL 2022: వైడ్ల నిర్ణయంపైనా డీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలి.. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ వెటోరి..

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 2022(IPL)లో అంపైర్ల నిర్ణయాలపై చర్చ కొనసాగుతూనే ఉంది. వైడ్లు, నోబాల్‌ వంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి...

IPL 2022: వైడ్ల నిర్ణయంపైనా డీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలి.. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ వెటోరి..
Wide
Follow us
Srinivas Chekkilla

| Edited By: Anil kumar poka

Updated on: May 04, 2022 | 8:49 AM

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 2022(IPL)లో అంపైర్ల నిర్ణయాలపై చర్చ కొనసాగుతూనే ఉంది. వైడ్లు, నోబాల్‌ వంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగళూరు మాజీ కోచ్‌ డానియల్‌ వెటోరి(vettori) ‘వైడ్ల’ అంశంపై స్పందించాడు. రాజస్థాన్‌, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వివాదస్పదంగా మారిన వైడ్ల ప్రకటనతో సంజూ శాంసన్‌ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో క్లిష్టమైన వైడ్ల(Wides) నిర్ణయాన్ని డీఆర్‌ఎస్‌ వినియోగించి తేల్చాలని బెంగళూరు మాజీ కెప్టెన్‌ డానియల్ వెటోరి సూచించాడు. వైడ్స్‌ కోసం ఆటగాళ్లు రివ్యూకు వెళ్లేందుకు అనుమతినివ్వాలన్నాడు. “ఇటువంటి క్లిష్టమైన విషయాల్లో ఆటగాళ్లకు స్వేచ్ఛ ఉండాల్సిందే. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. అయితే చాలాసార్లు అంపైర్ల నిర్ణయాలు బౌలర్లకు వ్యతిరేకంగా ఉన్నాయి.” అని వెటోరి అన్నాడు.

మరీ ముఖ్యంగా వైడ్ల విషయంలో కొన్ని తప్పులు జరిగాయని అనిపిస్తుందన్నారు. అందుకే వాటిని సరిదిద్దాలని… క్లిష్టమైన వైడ్ల నిర్ణయంపై డీఆర్‌ఎస్‌కు వెళ్లేందుకు అవకాశం ఇస్తే బాగుంటుందని వెటోరి అభిప్రాయపడ్డాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ వైడ్‌ ఇవ్వగానే అసహనానికి గురైన సంజూ శాంసన్‌ డీఆర్‌ఎస్‌ ఇవ్వాలని అడగటం నెట్టింట్లో వైరల్‌గా నిలిచింది. అలానే ఎల్బీడబ్ల్యూ అప్పీలుకు వెళ్లినప్పుడు నాటౌట్‌గా తేలినా సరే ఆ బంతిని డాట్‌గానే పరిగణించడం సరికాదని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. కీలకమైన మ్యాచుల్లో ఫలితం ఆ ఒక్క బంతితోనే ఉంటే వివాదం మరింత ఎక్కువుతుందని పేర్కొన్నాడు.

Read Also.. IPL 2022: ప్లేఆఫ్‌ బరిలో కొత్త జట్లు.. లిస్టులో చేరిన మరో రెండు.. 47 మ్యాచ్‌ల తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!