Sathyaraj: కట్టప్ప ఇంట విషాదం.. అనారోగ్యంతో సోదరి కన్నుమూత..

|

Dec 07, 2021 | 8:12 AM

'బాహుబలి' సిరీస్‌లోని కట్టప్ప పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ నటుడు సత్యరాజ్‌. అంతకుముందు తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు

Sathyaraj: కట్టప్ప ఇంట విషాదం.. అనారోగ్యంతో సోదరి కన్నుమూత..
Follow us on

‘బాహుబలి’ సిరీస్‌లోని కట్టప్ప పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ నటుడు సత్యరాజ్‌. అంతకుముందు తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఇటీవల ఆయన తనయుడు శిబి సత్యరాజ్‌ కూడా హీరోగా తెరంగేట్రం చేశాడు. కాగా తాజాగా సత్యరాజ్‌ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి కల్పన మండ్రాదియార్‌(66) అనారోగ్యంతో కన్నుమూశారు. ​తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లా కాంగేయంలో నివాసమున్న కల్పన గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు కోయంబత్తూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాసవిడిచారు. దీంతో సత్యరాజ్‌ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయింది.

సత్యరాజ్‌ సోదరి మృతి విషయం తెలుసుకున్న టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినీతారలు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఆదివారం సాయంత్రం కాంగేయంలోనే కల్పన అంత్యక్రియలు ముగిశాయి. సత్యరాజ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులందరూ హాజరై ఆమెకు నివాళి అర్పించారు. ఇక కల్పన భర్త కొన్నేళ్లక్రితమే చనిపోయారు. ఆమెకు మహేందర్‌ అనే కుమారుడు ఉన్నాడు.

Also read:

Kevvu Karthik: కెవ్వు కార్తీక్ కేక పుట్టించాడు.. వెండితెరపై కమల్ హాసన్, బుల్లితెరపై కార్తీక్..

Katrina- Vicky kaushal: కత్రినా- విక్కీల ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ !.. ఆహ్వానితుల జాబితా ఇదే!

Bigg Boss 5 Telugu: సన్నీ, సిరి మధ్య లవ్ ట్రాక్.. కోపంతో రెచ్చిపోయిన షణ్ముఖ్..