OTT Movies: ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రాలివే.. ఒక్కొక్కటి ఒక్కో డైమండ్ అంతే!

ఇదే టాలీవుడ్‌లో పక్కాగా అమలు చేస్తున్న పద్దతి! కాని ఈ పద్దతిని పక్కకు నెట్టి మరీ.. ఇప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాని సినిమాలు..

OTT Movies: ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రాలివే.. ఒక్కొక్కటి ఒక్కో డైమండ్ అంతే!
Ott Movies
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 29, 2022 | 4:55 PM

ఓ సినిమా రిలీజైన మూడు వారాలకో.. నాలుగు వారాలకో.. ఓటీటీలోకి రావడం.. ఆనవాయితీ..! ఇదే టాలీవుడ్‌లో పక్కాగా అమలు చేస్తున్న పద్దతి! కాని ఈ పద్దతిని పక్కకు నెట్టి మరీ.. ఇప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాని సినిమాలు తెలుగులో కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో..? అవి ఇంకా ఓటీటీలో ఎందుకు రిలీజ్ అవలేదో ఇప్పుడు తెలుసుకుందాం.

‘జిన్నా’:

మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోనీ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జిన్నా’. దీనికి ఇషాన్ సూర్య దర్శకుడు. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని చవి చూసింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

‘ది లెజెండ్’:

సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తమిళంలో తెరకెక్కిన సినిమా ‘ది లెజెండ్’. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్‌ శరవణన్‌ హీరో, నిర్మాతగా వ్యవహరించగా.. జేడీ- జెర్రీ దర్శకత్వం వహించారు. మొదట ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోగా.. ఎట్టకేలకు తాజాగా దీని ఓటీటీ విడుదలపై కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే డిస్నీ+హాట్‌‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

శేఖర్:

సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఆయన సతీమణి జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్’. మలయాళంలో హిట్ అయిన ‘జోసెఫ్’కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పలు వివాదాల కారణంగా రెండు రోజులకే చిత్ర ప్రదర్శన ఆగిపోగా.. ఆ తర్వాత మరికొన్ని వాదనల అనంతరం సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతిచ్చింది. అయితే ఇప్పటిదాకా మాత్రం ఈ చిత్రం ఓటీటీ డేట్ అన్నది ఇంకా ఖరారు కాలేదు.

ఈ మూడు మాత్రమే కాదు.. వరుణ్ సందేశ్ ‘ఇందువదన’, కొండా మురళీ జీవితాధరంగా తెరకెక్కిన ‘కొండా’, ‘సదా నన్ను నడిపే’, ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’, ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అనుకోని ప్రయాణం’ లాంటి సినిమాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు నవంబర్‌లో రిలీజ్ అయిన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తాయా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వీటిల్లో సంతోష్ శోభన్ ‘లైక్, షేర్, అండ్ సబ్‌స్క్రైబ్’, అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’, సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్రాలపై ఫ్యాన్స్ ఎక్కువ ఫోకస్ పెట్టారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం..