‘బాబా ఈజ్‌ బ్యాక్’‌.. షూటింగ్‌కి రెడీ అవుతున్న ‘అధీర’

| Edited By: Pardhasaradhi Peri

Oct 16, 2020 | 4:51 PM

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న కేజీఎఫ్‌ 2లో బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.

బాబా ఈజ్‌ బ్యాక్‌.. షూటింగ్‌కి రెడీ అవుతున్న అధీర
Follow us on

Sanjay Dutt Adheera: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న కేజీఎఫ్‌ 2లో బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సంజయ్ దత్‌కి క్యాన్సర్ అని తేలడంతో.. చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లారు. కాగా ఈ మధ్యలో సంజయ్‌ ఆరోగ్యంపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్యం విషమించిందని, చాలా బరువు తగ్గారని రకరకాల పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల మరో వార్త కూడా ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. సంజయ్ రాకపోతే ఆ స్థానంలో డూప్‌ని పెట్టి షూటింగ్ చేసేందుకు కేజీఎఫ్ 2 టీమ్ రెడీ అయ్యిందని మరో పుకారు షికారు చేసింది.

అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ బాబా బ్యాక్ వచ్చేశారు. అధీర కోసం సంజయ్ ప్రస్తుతం రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని సంజయ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అధీర కోసం రెడీ అవుతున్నా అని ఈ నటుడు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక నవంబర్ నుంచి సంజయ్‌.. కేజీఎఫ్‌ 2 షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. కాగా కేజీఎఫ్‌ సీక్వెల్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీ పాన్ ఇండియాగా విడుదల కానుంది. ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

షాకింగ్ న్యూస్.. రెమెడిసివర్‌పై డబ్ల్యూహెచ్‌ఓ సంచలన విషయాలు

అగ్నిప్రమాదంపై స్పందించిన నాగార్జున