Actress Sanjana Galrani : మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్న’బుజ్జిగాడు’ బ్యూటీ..

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మృతి కేసులో అనూహ్యంగా డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఎన్సీబీ తీగలాగితే కన్నడ..

Actress Sanjana Galrani : మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నబుజ్జిగాడు బ్యూటీ..

Edited By:

Updated on: Jan 05, 2021 | 1:29 PM

Actress Sanjana Galrani : బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మృతి కేసులో అనూహ్యంగా డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఎన్సీబీ బాలీవుడ్ లో తీగలాగితే కన్నడ ఇండస్ట్రీ డొంక కదిలింది. దాంతో అక్కడి ఇద్దరు హీరోయిన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. రాగిణి ద్వివేది, సంజన గల్రానీ లను బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసారు.

ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘బుజ్జిగాడు’ సినిమాలో సంజన సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసింది. అయితే డ్రగ్స్ కేసులో జైలు పాలు అయినా ఈ అమ్మడు గత ఏడాది డిసెంబర్ 13న బెయిల్ పైన బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత సంజన దూరంగా గడుపుతుంది. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని తన సన్నిహితులదగ్గర వాపోయిందంట. ఇక సంజన తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుందట. నిజానికి లాక్ డౌన్ కంటే ముందే రెండు సినిమాలకు సంజన సైన్ చేసిందట. ఈ క్రమంలో ఇప్పుడు ఒక తమిళ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Acharya Movie : ‘ఆచార్య’కోసం అడవులకు చిరు-చరణ్.. మారేడుమిల్లిలో మెగా హీరోల సందడి.. 

Sam Jam Season Finale: వారిద్దరూ కలిస్తే సూపర్ హిట్టేగా.. ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘చైయ్-సామ్’ ప్రోమో