అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు స్టార్ డం ఇవ్వడమే కాకుండా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఇప్పుడు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తోనూ అదే ఫలితాన్ని అందుకోని తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. షాహిద్ కపూర్‌కి సోలో హీరోగా ఇది తొలి వంద కోట్ల చిత్రం అవ్వడమే కాకుండా రెండొందల కోట్ల సినిమా కూడా కాబోతోందని టాక్ నడుస్తోంది.
ఈ యువ దర్శకుడి హంగామా చూసిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్ప్పుడు చేస్తున్న సంజయ్ లీలా భన్సాలీతో చేస్తున్న మూవ్ తర్వాత సందీప్ వంగాతో చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడట. ‘కబీర్ సింగ్’కు టీ–సిరీస్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామి అనే సంగతి తెలిసిందే. ఈ వ్యవహారమంతా ఆ సంస్థే నడుపుతున్నట్టు సమాచారం మరి.. సల్మాన్‌తో సందీప్ సినిమా ఉంటుందా? అంటే వేచి చూడాల్సిందే. ఈ సినిమా సంగతి అలా ఉంచితే సందీప్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌కు ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేయనున్నారు.